Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఓకే చెప్పేశారు..టాలీవుడ్ పున:ప్రారంభం అయినట్టే!
By: Tupaki Desk | 22 May 2020 4:19 PM GMTప్రాణాంతక వైరస్ కరోనా నేపథ్యంలో అటకెక్కేసిన తెలుగు చిత్ర పరిశ్రమ తిరిగి పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైపోయింది. కరోనా ఇంకా కనుమరుగు కాని నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని చిత్ర పరిశ్రమకు చెందిన దాదాపుగా అన్ని కార్యక్రమాలను పున:ప్రారంభించుకునేందుకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే కరోనా వ్యాప్తి ఇంకా తగ్గని నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు చెందిన కార్యకలాపాలను కొనసాగిస్తూనే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపై ఇప్పుడు కసరత్తు మొదలైపోయింది. ఈ మేరకు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో భేటీ తర్వాత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. టాలీవుడ్ కు చెందిన అన్ని కార్యకలాపాల పున:ప్రారంభానికి పచ్చ జెండా ఊపారు.
గురువారం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో భేటీని ముగించుకున్న టాలీవుడ్ ప్రముఖులు.. శుక్రవారం తలసానిని వెంటేసుకుని నేరుగా కేసీఆర్ తో భేటీకి వెళ్లారు. ప్రభుత్వం తరఫున కేసీఆర్ తో పాటు తలసాని - మంత్రి నిరంజన్ రెడ్డి - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు హాజరైన ఈ భేటీకి టాలీవుడ్ నుంచి చిరంజీవి - నాగార్జున - దగ్గుబాటి సురేశ్ బాబు - అల్లు అరవింద్ - ఎన్. శంకర్ - ఎస్ ఎస్ రాజమౌళి - దిల్ రాజు - త్రివిక్రమ్ శ్రీనివాస్ - కిరణ్ - రాధాకృష్ణ - కొరటాల శివ - సి. కల్యాణ్ - మెహర్ రమేశ్ - దాము తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిలిచిపోయిన షూటింగ్ లను ప్రారంభించడం - రీప్రొడక్షన్ పనులను పున:ప్రారంభం - థియేటర్ల రీ ఓపెనింగ్ తదితరాలను టాలీవుడ్ ప్రముఖులు కేసీఆర్ ముందు పెట్టారు. ఈ విషయాలన్నింటికీ కేసీఆర్ సానుకూలంగానే స్పందించారు.
అయితే కరోనా వ్యాప్తి ఇంకా తగ్గని నేపథ్యంలో టాలీవుడ్ కు చెందిన అన్ని కార్యకలాపాలను పున:ప్రారంబించుకోడానికి అనుమతిచ్చిన కేసీఆర్... ఈ పనులన్నీ పున:ప్రారంభమైతే.. దాని మాటున కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకోసం మంత్రి తలసానితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూర్చుని గైడ్ లైన్స్ ను రూపొందించుకోవాలని కేసీఆర్ సూచించారు. అంతేకాకుండా పనులు పున:ప్రారంభమైనా కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడరాదని కూడా కండీషన్ పెట్టారు. లాక్ డౌన్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కూడా కేసీఆర్ సూచించారు. ఆయా కార్యకలాపాల్లో వీలయినంత తక్కువ మందిని వినియోగించేలా చూసుకోవాలని ఆదేశించారు.
ఇక టాలీవుడ్ కు కీలక రంగాలైన షూటింగ్, సినిమా థియేటర్ల విషయంలో కేసీఆర్ పలు సూచనలు చేశారు. థియేటర్ల రీ ఓ పెనింగ్ కాస్తంత ఆలస్యమైనా ఇప్పటికిప్పుడు షూటింగ్ లు ప్రారంభించుకోవాల్సిన విషయాన్ని టాలీవుడ్ పెద్దలు ప్రస్తావించగా... ముందుగా ఇండోర్ షూటింగ్ లను ప్రారంభించుకోవాలని కేసీఆర్ సూచించారు. ఆ తర్వాత అవుట్ డోర్ షూటింగ్ లు, ఆపై థియేటర్ల ఓపెనింగ్ తదితరాలపై దృష్టి సారించాలని కూడా కేసీఆర్ సూచించారు. ఈ మొత్తం అన్ని కార్యకలాపాల విషయంలో పాటించాల్సిన గైడ్ లైన్స్ రూపకల్పనను కూడా వేగంగా ముగించాలని కేసీఆర్ సూచించారు. మొత్తంగా టాలీవుడ్ పెద్దలు కోరినట్టుగా కేసీఆర్ దాదాపుగా అన్ని విషయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. అతి త్వరలోనే టాలీవుడ్ సందడి మొదలు కానుందని చెప్పక తప్పదు.