Begin typing your search above and press return to search.
టాలీవుడ్ సెలబ్రిటీల కొంపలంటించిన కరోనా!
By: Tupaki Desk | 2 Feb 2020 7:02 AM GMTప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం ఆషామాషీగా లేదు. విమానాశ్రయాల్లో అడుగడుగునా డాక్టర్లు అధికారులు చెకప్ లు చేస్తుండడంతో ఆ ప్రభావం ఈ రంగంపై తీవ్రంగానే పడుతోంది. చైనాలో ఇప్పటికే 350 మంది మరణించగా.. 10వేలు పైగా వ్యాధిగ్రస్తులు ఐసీయుల్లో చికిత్స పొందుతుండడం భయపెడుతోంది. ఇంకా ఎందరో కరోనా భారిన పడ్డారన్న అనుమానాలు .. వెరసి ఈ వైపరీత్యానికి ప్రపంచదేశాలు గజగజలాడిపోతున్నాయి. చైనా నుంచి ఎవరికి వారు విదేశీయులంతా తమ వారిని వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పలువురు భారతీయుల్ని చైనా వూహూ (కరోనా వ్యాప్తి ఉన్న ప్రదేశం) నుంచి వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇక చైనా నుంచి పర్యాటకులు వెళ్లే బ్యాంకాక్ - థాయ్ లాండ్- ఫిజీ సహా పలు ఎగ్జోటిక్ దీవులన్నీ పూర్తిగా స్థింబించి పోయాయని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయా దేశాలకు టిక్కెట్లు బుక్ చేసుకున్న సెలబ్రిటీలంతా వాటిని క్యాన్సిల్ చేసుకోవడంతో అది కాస్తా హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల గత కొంతకాలంగా మాల్దీవుల్లో విహారానికి వెళ్లిన పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఇండియాకు తిరిగి వచ్చేశారు. అటు బాలీవుడ్ టూరిస్టులపైనా అంతే ప్రభావం కనిపిస్తోందిట.
కరోనా ప్రభావం టాలీవుడ్ పై ఎంత? అన్నది విశ్లేషిస్తే.. రెగ్యులర్ గా బ్యాంకాక్.. థాయ్ ల్యాండ్ సహా పలు ఎగ్జోటిక్ లొకేషన్లకు టూర్లు వెళ్లే సెలబ్రిటీలంతా ఇప్పుడు అప్రమత్తమయిపోయారని తెలుస్తోంది. ప్రతిసారీ స్క్రిప్టు రాసేందుకు బ్యాంకాక్ - థాయ్ ల్యాండ్ కి వెళ్లే పూరి లాంటి టాప్ డైరెక్టర్ సైతం గోవాతో సరిపెట్టుకుంటున్నారట. అలాగే థాయ్ ల్యాండ్ లోని అడవుల్లో షూటింగ్ కోసం ప్రిపరేషన్స్ చేసుకున్న బన్ని- సుకుమార్ టీమ్ పైనా ఈ ప్రభావం ఉందా? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే ఎగ్జోటిక్ డెస్టినేషన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకున్న పలువురు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు విమానం టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఒకే ఒక్క దెబ్బకు సెలబ్రిటీలంతా ఒణికిపోతున్నారు. కరోనా కల్లోలం ఏ రేంజులో ఉందో విశ్లేషించేందుకు ఇంతకంటే ఏం కావాలి. వీధుల్లో వెళుతున్న వాళ్లు వెళుతున్నట్టుగానే కుప్పకూలి చనిపోతుండడం చూస్తుంటే జాంబీ సినిమాల్నే తలపిస్తోంది. అన్నట్టు జాంబీ సినిమాలు తీసిన పరిశోధకులే ఇలాంటి ఒక వైరస్ ని కనిపెట్టి జనసమ్మర్థంగా ఉండే చైనా మీదికి వదల్లేదు కదా? ఇందులో అమెరికా కుట్ర కోణం ఏదీ లేదు కదా?