Begin typing your search above and press return to search.
మేం శాంటా అయితే భువిని మార్చేస్తాం
By: Tupaki Desk | 25 Dec 2015 5:41 AM GMTఈరోజు క్రిస్ మస్. అందరికీ క్రిస్ మస్ శుభాకాంక్షలు. కేవలం శుభాకాంక్షలు చెబితే సరిపోతుందా? మీరే గనుక శాంటా అయితే ఏం చేస్తారు? ఇదే ప్రశ్న రకూల్ ప్రీత్ - నిఖిల్ - గీతామాధురి - అల్లు శిరీష్ లాంటివాళ్లను అడిగితే ఏం చెప్పారో తెలుసా?
ముందుగా జీసస్ కి థాంక్స్. నేనే గనుక శాంటా అయితే అసలు పొల్యూషన్ అన్నదే లేకుండా చేసేస్తానని నిఖిల్ ప్రామిస్ చేశాడు. తిండి కాలుష్యం - నీరు కాలుష్యం - గాలి కాలుష్యం - బతుకు కాలుష్యం .. అన్నీ కాలుష్యమే. ఈ కాలుష్య కాషారాన్ని దూరంగా తరిమేసి ప్రజలకు ఓ స్వచ్ఛమైన భూమిని కానుకగా ఇస్తానని అన్నాడు.
అసలు ఈ మనుషుల మధ్య శాంతి అనేదే లేదు. గోల్స్ కోసం పోరాటం సాగుతూనే ఉంటుంది. అసాధ్యం అన్నదే లేకుండా చేస్తే శాంతి పుడుతుంది. నేనే గనుక శాంటాని అయితే మనుషులందరికీ అలాంటి వరమిచ్చేస్తా అంటూ చెప్పుకొచ్చింది ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి.ఈ భూమ్మీద అశాంతి అన్నదే లేకుండా చేసేస్తానని అంది.
మనిషికి కనీసం తిండి - నీరు - గుడ్డ అవసరం. బతికేందుకు మినిమంగా ఇవి చాలు. అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ - డిగ్నిటీతో ప్రతి ఒక్కరూ బతకాలి. అవన్నీ శాంటా వల్ల సాధ్యమవుతాయంటే నేను అదే చేస్తాను.. అంటూ గీతామాధురి తన మనసులో మాటను చెప్పింది.
నాకే గనుక శాంటాకి ఉన్నన్ని శక్తులు వచ్చేస్తే .. అసలు ఈ మనిషిలోని స్వార్థాన్ని అంతం చేసేస్తాను. మెటీరియలిస్టిక్ గా ఉండకుండా చేసేస్తా. నువ్వు నువ్వుగానే బతికేందుకు, నీలో శక్తిని వినియోగించి ఎదిగేందుకు ప్రయత్నించు. అలాంటి శక్తిని మనిషికి ఇస్తాను.. అంటూ అల్లు శిరీష్ తన మనసులో మాటను చెప్పాడు. అదీ మ్యాటరు.