Begin typing your search above and press return to search.
హలీమ్ కోసం వెంపర్లాడే తారలు
By: Tupaki Desk | 1 July 2016 6:31 AM GMTహైద్రాబాద్ అంటే చార్మినార్ ఎంత ఫేమస్సో.. మంచి రుచి ఉన్న నాలుక గల వాళ్లకైతే బిర్యానీకి అంత ఫేమస్. మిగతా సీజన్లలో బిర్యానీకి ఎంత క్రేజ్ ఉంటుందో.. రంజాన్ టైమ్ లో హలీమ్ కోసం అంతగా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఫుడీస్ అయితే.. హలీమ్ టేస్ట్ కోసం ఎదురుచూసేస్తూ ఉంటారు. మరి టాలీవుడ్ తారల్లో హలీమ్ కోసం వెంపర్లాడే వాళ్లు కొంతమంది ఉన్నారు.
రెండున్నరేళ్ల క్రితం మొదటిసారి హలీమ్ టేస్ట్ చూసిందట రకుల్ ప్రీత్ సింగ్. 'నేను పెద్ద ఫుడీని. మొదటిసారి తినగానే హలీం విపరీతంగా నచ్చేసింది. ప్రతీ ఏటా రంజాన్ టైమ్ లో ఓల్డ్ సిటీ తిరిగేసి హలీమ్ - కబాబ్స్ - బిర్యానీ లాగించేస్తుంటా' అంటోంది రకుల్ ప్రీత్ సింది. కుర్ర హీరో నిఖిల్ అయితే టేస్ట్ చేసిన మొదటిసారే హలీమ్ కి కనెక్ట్ అయిపోయాడట. చార్మినార్ ప్రాంతంలో ఇరానీ కేఫ్ లకు వెళ్లి హలీమ్ తినేస్తుంటా అని చెబుతున్నాడు నిఖిల్. హలీమ్ టేస్ట్ అర్ధం కావడానికి హర్ష వర్ధన్ రాణేకి మూడేళ్లు పట్టిందట. ఆ తర్వాత మాత్రం ఇక ఆ రుచిని వదులుకోలేకపోతున్నా అంటున్నాడు.
ప్రతీ రంజాన్ సీజన్ లో కనీసం ఒక్కసారైనా హలీమ్ టేస్ట్ చూడాల్సిందే అంటోంది తాప్సి పన్ను. మొదట మాంసంను అలా నెయ్యితో ఎలా తింటారో అనుకుందట కానీ.. ఒకసారి తిన్న తర్వాత.. ఆ రోజల్లా అదే తింటూ కూర్చున్నా అని చెప్పింది తాప్సీ. ఇక సంజన అయితే.. ఫస్ట్ టైమ్ టేస్ట్ చేసినప్పుడే హలీమ్ ని వదిలిపెట్టలేక.. బెంగళూరు వెళ్తూ వెళ్తూ కొన్ని బాక్సులు కట్టించుకుని పట్టుకెళ్లా అని చెప్పింది. ఏమైనా హైద్రాబాద్ హలీంకి తారల్లో ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు.