Begin typing your search above and press return to search.
‘‘నాన్న’’ కడుపు చల్లగా.
By: Tupaki Desk | 18 Jun 2016 11:30 AM GMT నాన్న ప్రేమకు కొలమానాలు ఉండవు.. పిల్లల విషయంలో నాన్నలు తీసుకునే శ్రద్ధకు హద్దులు లేవు. వేలు పట్టి నడిపించి ప్రయోజకులను చేసేవరకు విశ్రమించని శ్రామికులు నాన్నలు. ఈకాలపు నాన్నలయితే అమ్మ పాత్ర కూడా తామే పోషిస్తూ పిల్లల బాగోగులను చూస్తున్నారు. అందుకే అందరు పిల్లలకు నాన్నంటే దేవుడు.. ఆ దేవుడుకి నచ్చినట్లు ఉండాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. నాన్న ఇష్టాలను గుర్తించి తీర్చాలని తపించే సంతానానికి కొదవే లేదు. సాధారణ కుటుంబాల్లోని పిల్లలైనా సెలబ్రిటీలైనా.. ఎవరికైనా సరే నాన్నంటే దేవుడే. తమ దేవుడికి నచ్చిన నైవేద్యం పెట్టాలనుకుంటున్నారట తెలుగు సినిమా ఇండస్ర్టీలోని యువతరం. ఫాదర్స్ డే సందర్భంగా వారు తమ తండ్రులకు ప్రీతిపాత్రమైన వంటకాలు చేసి వడ్డిస్తామని చెబుతున్నారు. మరి ఎవరేం తయారుచేయాలనుకుంటున్నారో చూద్దామా..
వరుస హిట్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ వర్సటైల్ హీరో నాని అయితే తన తండ్రికి ఇష్టమైన పెసరట్టు తయారుచేసి ఫాదర్స్ డే రోజు పొద్దన్నే తినిపిస్తానంటున్నాడు. ఆరు నెలలుగా అమెరికాలో ఉంటున్న అమ్మకు దూరంగా ఉంటున్నప్పటికీ నాన్న ప్రేమలో అమ్మ ఎడబాటును సైతం మర్చిపోయానని చెబుతున్నాడీ కుర్ర హీరో. నాన్నకు ప్రేమతో పెసరట్టు తినిపిస్తానంటూ అదెలా చేస్తాడో కూడా వివరించి మరీ చెబుతున్నాడు.
ఇక కలువ కళ్ల సుందరి ఆదా శర్మ అయితే తన నాన్నకు ఏమిష్టమో అది చేసి ఫాదర్సు డే ను వేడుకగా జరుపుతానని చెబుతోంది. తన తండ్రికి కొబ్బరి పాల పాయసం అంటే ఇష్టమని.. అది ఆయనకు నచ్చేలా చేస్తానని చెబుతోంది. తన పుట్టిన రోజుకు - పండగలకు అమ్మ తప్పకుండా చేసిన వంటల్లో కొబ్బరిపాల పాయసం ఉంటుందని.. అదంటే నాన్నకు చెప్పలేని ఇష్టమని.. కిస్ మిస్ లు - జీడిపప్పులు - నెయ్యి బాగా దట్టించి కొబ్బరిపాల పాయసం తయారుచేసి నాన్నకు కానుక ఇస్తానంటోందీ అమ్మడు.
అగ్రహీరోలతో జత కడుతూ తెలుగు తెరపై తారాపథంతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా నాన్నకు ప్రీతిపాత్రమైన వంటకాన్ని అందిస్తానంటోంది. తనకు నార్తు ఇండియన్ వంటకాలు మాత్రమే తెలుసని.. కానీ.. తన తండ్రికి ఆంధ్ర వంటకమైన గోంగూర పచ్చడంటే తగని మక్కువని చెబుతూ.. నాన్న కోసం గోంగూర పచ్చడి చేసి తినిపిస్తానంటోంది బుంగమూతి సుందరాంగి.
ఇక మిల్కీ గాళ్ తమన్నా కూడా తక్కువేం తినలేదు. సీనియర్ హీరోయిన్నయినా నాన్నకు ఇంకా జూనియర్ నే అని చెబుతూ ఆయనకు ఇష్టమైన ఆలూ టుక్ చేసి పెడతానంటోంది. గిన్నెలో నీళ్లు పోసి, ఉప్పు వేసి బంగాళదుంపలను ఉడికించి.. వాటిని మళ్లీ గోధుమరంగు వచ్చేవరకు వేయించి - కారం - మిరియాల పొడి - ఉప్పు చల్లి వెంటనే తానే స్వయంగా నాన్నకు వడ్డిస్తానని తమన్నా ఉత్సాహంగా చెబుతోంది.
ఇక మన తెలుగు నవ్వుల హరివిల్లు నీహారిక కూడా తన తండ్రి నాగబాబుకు అత్యంత ఇష్టమైన గుత్తొంకాయ చేస్తానని చెబుతోంది. అప్పుడప్పుడూ నాన్న కోసం గుత్తొంకాయ చేస్తుంటానని... ఫాదర్స్ డే సందర్భంగా మరోసారి అదే వంటకాన్ని నాన్నకు తన చేతులతో తినిపిస్తానని అంటోందీ మెగా హీరోయిన్.