Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ తిండిబోతుల కథ!!

By:  Tupaki Desk   |   4 July 2015 1:30 PM GMT
టాలీవుడ్‌ తిండిబోతుల కథ!!
X
ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. తిండిలోనూ ఇది వర్తిస్తుంది. కొందరు హోటల్‌ ఫుడ్‌ని లొట్టలేసుకుని తింటారు. మరికొందరైతే పక్కాగా హోమ్‌ ఫుడ్‌ని ఇష్టపడతారు. పరిసరాల ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంటుంది కాబట్టి ఇలా ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఏర్పడుతుంది. అయితే టాలీవుడ్‌లో ఫుడ్డింగ్‌ హ్యాబిట్‌ చాలా డిఫరెంట్‌.

అలనాటి మేటి నాయికలంతా ఇంటి దగ్గర్నుంచే క్యారేజీ తెచ్చుకునేవారు. అంతేనా శ్రీదేవి, జయప్రద, సావిత్రి, భానుప్రియ లాంటి స్టార్లు సెట్స్‌కి ఓ భారీ క్యారేజీతో భోజనం తెచ్చి సహనటీనటులు, టెక్నీషియన్లతో కలిసి తినేవారని ఇలాంటి అరుదైన కల్చర్‌ అప్పట్లో ఉండేదని పెద్దలు చెబుతారు. ఆ తర్వాతి కాలంలోనూ ఈ సాంప్రదాయం చాలా కాలం కొనసాగింది. కాలక్రమేణా పని ఒత్తిళ్లతో ఇంటి నుంచి క్యారేజీ దూరమై హోటల్‌ ఫుడ్డుని మరిగారు. రకరకాల హోటళ్ల నుంచి డిఫరెంటు రుచులకు అలవాటు పడ్డారు. ముఖ్యంగా నవతరం హీరోలు ఇంటి నుంచి వచ్చే క్యారేజీకే ప్రాధాన్యతనిచ్చినా, వెరైటీల కోసం అప్పుడప్పుడు హోటల్‌కి ఆర్డర్‌ వేస్తున్నారని టాక్‌.

మొన్ననే ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పంచభక్ష పరమాన్నం వంటి భోజనాన్ని ఇంటి నుండి తెప్పించి యూనిట్‌తో కలిసి తింటున్నారు. అక్కడున్న క్యారేజీ, కంచాలు చూస్తుంటే ఇంటినుంచే రుచికరమైన భోజనం సెట్స్‌కొచ్చినట్టు అర్థమవుతోంది. ఇలాంటి సంప్రదాయం మంచిదే. దీన్ని యువతరం హీరోలు కాపాడుకుంటూ ఫ్యామిలీతో పనిచేసినట్టు ఎంజాయ్‌ చేయాలని కోరుకుందాం.