Begin typing your search above and press return to search.
డ్రగ్స్ మత్తులో రవితేజ్ - పూరి జగన్ - ఛార్మి??
By: Tupaki Desk | 14 July 2017 5:46 AM GMTఅసలు స్కూల్ పిల్లలు.. కాలేజీ యువత మాత్రమే హైదరాబాదులో ఈ డ్రగ్స్ మత్తులో తూగుతున్నారు అనుకుంటే.. ఇప్పుడు ఈ డ్రగ్స్ వాడకంలో వీరందరినీ మించి టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా పెద్ద ఎత్తులో మత్తులో తూగుతున్నారని ఎక్సయిజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు చెబుతున్నారు. ఈరోజు ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ వీరందరి పేర్లనూ బట్టబయలు చేసింది.
ఆ ఛానల్ రిపోర్టు ప్రకారం.. కెల్విన్.. కుదూస్.. వాహెద్ అనే ముగ్గురు డ్రగ్ పెడ్లర్లు అరెస్టయిన తరువాత.. వారి ఫోన్ కాల్స్ వాట్సాప్ మెసేజస్ ఆధారంగా చాలా వివరాలు ఆధారాలు సేకరించి.. ఇప్పుడు టాలీవుడ్ లో ఏకంగా 19 మంది ప్రముఖులను లిస్ట్ అవుట్ చేశారట. హీరో రవితేజ.. డైరక్టర్ పూరి జగన్.. హీరోయిన్ ఛార్మి.. ఐటం బాంబ్ ముమాయత్.. కెమెరామ్యాన్ శామ్.కె.నాయుడు.. యాక్టర్ సుబ్బరాజు.. ఆర్ట్ డైరక్టర్ చిన్నా.. హీరోలు తరుణ్.. నవదీప్.. తనీష్.. నందు.. లకు ఇప్పుడు ఎక్సయిజ్ శాఖ నోటీసులు కూడా అందించినట్లు సదరు ఛానల్ పేర్కొంది.
ఇప్పుడు ఈ సెలబ్రిటీలు తమ డ్రైవర్ల ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్న సిసి టివి ఫుటేజీలూ.. అలాగే ఈ సెలబ్రిటీలు డ్రగ్ పెడ్లర్లతో సాగించిన వాట్సాప్ సంభాషణలు.. వగైరా వగైరా సాక్ష్యాలు ఉన్నాయట. అంతేకాదు.. వీరిలో కొంతమంది సెలబ్రిటీలు బ్యాంకాక్ వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంటే.. కొందరు విచారణకు తాము హాజరు కాకుండా లాయర్ ను పంపిస్తామని చెబుతున్నారట. అయితే ఎక్సయిజ్ శాఖ మాత్రం.. పర్సనల్ గా విచారణకు రావల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది.
వీరందరూ 19వ తారీఖు నుండి 27వ తారీఖు మధ్యన నాంపల్లి ఎక్సయిజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసులో అధికారుల సమక్షంలో విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వీరు హాజరుకాకపోతే మాత్రం అరెస్టు చేసే అవకాశం కూడా ఉందట. ఇప్పటివరకు 12 మంది తెలుగు సెలబ్రటీలు నోటీసులు అందుకోగా.. వారిలో 10 మంది నోటీస్ తీసుకున్నట్లు ఎక్నాలెడ్జమెంట్ కూడా అందిందంట.
ఇప్పుడు ఈ సెలబ్రిటీల్లో ఎంతమంది విచారణకు హాజరు అవుతారు.. ఎంతమంది పలుకుబడిని వాడుకుని తప్పించుకుంటారు.. చూడాల్సి ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు వీరి పేర్లను ఎక్సయిజ్ ఎన్ఫోర్స్ మెంట్ శాఖ అఫీషియల్ గా ప్రకటించే ఛాన్సున్నట్లు ఆ ఛానల్ కథనం తెలిపింది.