Begin typing your search above and press return to search.
ఎన్నికలు వస్తే టాలీవుడ్ కి జ్వరం!
By: Tupaki Desk | 3 Dec 2018 7:37 AM GMTఇండియాలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే... అవి ఎన్నికలే. రాజకీయ నాయకుల బుద్ధి తెలుసు. వారి వల్ల ఒరిగేది ఏమీ లేదని తెలుసు. అయినా కూడా ఎన్నికలు అంటే అదో పెద్ద ఎమోషన్. ఇక అసెంబ్లీ ఎన్నికలు అయితే ఎక్కడలేని డిస్కషన్లు ఎంతకీ ఆగకుండా సాగుతూ ఉంటాయి. ఎవరి లాజిక్ వారిది. ఎన్నికలు అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే, టాలీవుడ్ కి మాత్రం హారర్ టాపిక్. అవును... ఎన్నికలు ఎందుకు వస్తాయిరా దేవుడా అని టాలీవుడ్ వణుకుతూ ఉంటుంది. ఎన్నికలు వస్తే వారికి ఏం ప్రాబ్లం అని అనిపిస్తుంది మీకు... వారి బాధ వింటే అర్థమవుతుంది.
సాధారణంగా రాజకీయ నాయకుల్లో చాలామంది సినిమా వాళ్లతో మంచి సంబంధాలు మెయింటెయిన్ చేస్తారు. అన్ని పార్టీ వాళ్లు వారితో స్నేహం చేస్తారు. కానీ అధికార పార్టీ వారితో వాళ్లు కాస్త ఎక్కువ చనువుగా ఉంటారు. ప్రభుత్వానికి ప్రచారం కోసం అపుడపుడు ఉచిత సేవలు కూడా అందించడానికి రెడీగా ఉంటారు. ఇదొక మ్యూచువల్ కన్సెంట్. ఇంతవరకు బానే ఉంటుంది కానీ... ఎన్నికలు వస్తే వారి పాపులారి తమకు వాడుకోవాలని నాయకులు ఆరాటపడుతుంటారు. డైరెక్టుగా అడగరు గాని... ఇన్ డైరెక్టుగా హింట్ ఇస్తుంటారు. అయితే, సినిమా వాళ్లవి సున్నిత కెరీర్లు. రాజకీయాల్లో ఏమాత్రం అటు ఇటు అయినా దాని ప్రభావం కెరీర్ పై ఉంటుంది. అందుకే ఎన్నికలు ఎందుకు వస్తాయిరా బాబూ అని వాళ్లు ప్రాణాలు గుక్కపట్టుకుని ఉంటారు.
ఇటీవల ఓ సినిమా కుటుంబ పెద్ద గతంలో టీఆర్ ఎస్ పై కోపంగా ఉండేవారు. తాజాగా వారికి అనుకూలంగా మాట్లాడారు. మళ్లీ టీఆర్ఎస్ వస్తుందేమోనని ఆయన నమ్మకం. ఒకవేళ అధికారంలోకి టీఆర్ఎస్ రాకపోతే ఏంటి పరిస్థితి? అయినా తప్పదు. కొన్ని సార్లు సినిమా వాళ్లు స్థిరాస్థి విషయంలోనూ, వ్యాపార అనుమతుల విషయంలో నేతల సాయం తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారికయితే పాపం పిచ్చెక్కిస్తాయి ఎన్నికలు. రుణం తీర్చుకోమని అడిగితే ఏం చేయాల్రా దేవుడా అని మదనపడుతుంటారు. కొందరు రాజకీయ నాయకులు సినిమా వాళ్లని అర్థం చేసుకుని వదిలేస్తారు. కొందరేమో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఈ ఎన్నికలు లేకపోతే ఎంత బాగుంటుందో అని సినీ లోకం కోరుకుంటుంది.