Begin typing your search above and press return to search.
సిండికేట్ దిగిరాక తప్పదా?
By: Tupaki Desk | 24 May 2015 5:30 PM GMTముందేమో నట్టికుమార్ గళం విప్పాడు.. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ ధ్వజమెత్తాడు. అప్పుడు కూడా రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మోహన్‌బాబే దిగిపోయారు. పెద్ద నిర్మాతల సిండికేట్‌ను టార్గెట్ చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐతే ఇన్నాళ్లలా ఏమీ పట్టనట్లు ఉండే పరిస్థితి కనిపించడం లేదు. మోహన్‌బాబు మాట్లాడారంటే ఇంకా కొన్ని గొంతులు లేస్తాయి. పైగా మోహన్‌బాబు ఈ విషయం మీదే ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ అటాక్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. అప్పుడు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దాసరి వారు బొగ్గు కేసులో చిక్కుకోబట్టి సైలెంటుగా ఉన్నారు కానీ.. లేదంటే ఆయన మోహన్‌బాబు కన్నా ముందే ఫైర్ అయ్యేవారు. ఐతే ఆయన మద్దతుదారులు సైలెంటుగా ఉంటారని అనుకోవడానికి లేదు. ఓ వర్గం మీడియాకే ప్రకటనలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఇండస్ట్రీలో మెజారిటీ నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు. మిగతా మీడియా వ్యతిరేకంగా పని చేసిందా లేదా అన్నది పక్కనబెడితే ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి తెలుగు సినిమాల పరిస్థితి బాగా లేదన్నది మాత్రం వాస్తవం. పర్వాలేదు అనుకున్న సినిమాలు కూడా నిలవలేకపోవడానికి వ్యతిరేక మీడియా ప్రభావమే కారణమని.. మీడియాతో శత్రుత్వం మంచిది కాదని.. చాలామంది నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. రోజు రోజుకూ సిండికేట్ మీద వ్యతిరేకత, ఒత్తిడి పెరిగిపోతుండటంతో త్వరలోనే వాళ్లు దిగిరాక తప్పదని.. నిర్ణయం మార్చుకుని ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ప్రకటనలు ఇచ్చుకునే స్వేచ్ఛ కల్పించక తప్పదని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.