Begin typing your search above and press return to search.
ఓ పనికోసం అంతమంది ముందుకొచ్చారు
By: Tupaki Desk | 30 March 2018 4:40 AM GMTటాలీవుడ్ లో ఇప్పుడు యంగర్ జనరేషన్ హీరోలు చాలామందే ఉన్నారు. వీళ్లలో చాలామంది ఇప్పుడు ఒకచోటకు వచ్చి సందడి చేశారు. ఇదంతా సినిమా షూటింగ్ కాసం కాకుండా ఓ మంచి పనికోసం చేశారు. సరైన సదుపాయాలు లేక చదువుకు దూరమైపోతున్న చిన్నపిల్లలకు సాయం చేయడం కోసం యంగ్ యాక్టర్లంతా ఓ ఈవెంట్ చేశారు.
పిల్లలకు మంచి విద్యావకాశాలు కల్పించే లక్ష్యంతో టీచ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థకు ఫండ్స్ కలెక్ట్ చేసేందుకు నటి మంచు లక్ష్మి ముందుకొచ్చింది. ఆమె చొరవతో యంగ్ హీరో.. హీరోయిన్ల్లంతా ఓ ఈవెంట్ లో ర్యాంప్ పై మెరుపులు మెరిపించారు. నిఖిల్ - అల్లు శిరీష్ - నవదీప్ - సుశాంత్ - అడవి శేష్ - ఆదర్శ్ - రకుల్ ప్రీత్ సింగ్ - ఈషా రెబ్బా - తేజస్వి మాదివాడ - సీరత్ కపూర్ తో పాటు మరికొందరు ఈ ఈవెంట్ లో పాలు పంచుకున్నారు.
ఈ ఈవెంట్ కు హీరోలంతా వీలైనంత వరకు బ్లాక్ డ్రస్ లో స్టయిలిష్ లుక్స్ తో వస్తే హీరోయిన్లంతా సంప్రదాయ దుస్తుల్లో అచ్చ తెలుగు ఆడపిల్లల్లా కనిపించడం హైలైట్. ఏదేమైనా ఓ మంచి పనికోసం ఇంతమంది ఒకేసారి కలిసిరావడం అభినందించాల్సిన విషమయే. కీపిటప్ ఆల్ ఆఫ్ యూ.