Begin typing your search above and press return to search.
ఎన్ కౌంటర్ పై టాలీవుడ్ సెలబ్ స్పందన
By: Tupaki Desk | 6 Dec 2019 7:09 AM GMTదిశ ఘటనలో కర్కశంగా వ్యవరించిన ఆ నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామన సరిగ్గా 3.30 గంటల ప్రాంతంలో తెలంగాణ పోటీస్ ఎన్ కౌంటర్ చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దిశకు ఇప్పుడు సరైన న్యాయం జరిగిందని.. తన ఆత్మకు శాంతి చేకూరుందని .. అసలైన అశ్రునివాళి ఇదేనని దేశవ్యాప్తంగా ప్రజలు .. సెలబ్రిటీలు మరోసారి గళమెత్తారు. అటు కామన్ ప్రజల నుంచి ఇటు సినీరాజకీయ ప్రముఖుల వరకు హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం అంటూ అంతా సెల్యూట్ చేస్తున్నారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వ్యహరిస్తే అత్యాచారం అనే ఆలోచనే రాదు అంటూ ముక్త కంఠంతో సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.
ఇటు టాలీవుడ్ సహా అటు బాలీవుడ్ .. ఇరుగు పొరుగు పరిశ్రమల్లోనూ దీనిపై హోరెత్తిపోతోంది.
టాలీవుడ్ సెలబ్రిటీల్లో ఎన్టీఆర్- బన్నీ- నాని- మంచు మనోజ్- పూరి జగన్నాథ్- మంచు విష్ణు- కళ్యాణ్ రామ్- విశాల్- రకుల్ ప్రతీసింగ్- సమంత అక్కినేని- అనీల్ రావిపూడి- రవితేజ ఇంకా పలువురు సెలబ్రిటీలు పోలీసుల్ని అభినందించారు. ఇక పూరి అయితే పోలీసులే దేవుళ్లు. మనకి కష్టం వచ్చినా.. కన్నీళ్లు వచ్చినా పోలీసోడే వస్తాడు. నువ్వే దిక్కు రక్షించాలని మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే అంటూ తనదైన శైలిలో ఉద్వేగంగా వ్యాఖ్యానించారు