Begin typing your search above and press return to search.
సినిమా (తారల) సెంటిమెంట్లు..
By: Tupaki Desk | 6 Sep 2015 7:46 PM GMTసిమెంట్ లేని గోడ సెంటిమెంట్ లేని మనిషి నిలబడలేవు అన్నది ఒక సినిమాలో డైలాగ్. ఎంతటి రేంజ్ లో వున్నా ఈ సెంటిమెంట్ మనుషుల్ని వెంటాడుతూనే వుంటుంది. సినిమా లాంటి ఇండస్ట్రీలో ఇది మరీ అధికం. అయితే ఈ సెంటిమెంట్ లు కొన్ని వినడానికి కూడా విడ్డూరంగా వినిపిస్తాయి. అలాంటి కొన్ని సెంటిమెంట్ లు మీకోసం..
ఈ మధ్య తరచూ ఆడియో ఫంక్షన్ లలో, ఇంటర్వ్యూ లలో కనువిందు చేస్తున్న మహేష్ బాబు కి తన సినిమా ముహూర్తపు వేడుకకు మాత్రం రాడంట. ముహూర్తానికి దూరంగా వుండడం సెంటిమెంట్ గా భావించడం ఆశ్చర్యకరమైనా అది నిజమేనని తెలుస్తుంది. హైదరాబాద్ లో సుదర్శన్ థియేటర్ తనకు అచ్చొచ్చిన థియేటర్ అని పలుమార్లు తెలిపాడు. ఇక స్టైలిష్ స్టార్ బన్నీ అయితే తన సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుపుకుంటే అది ఖచ్చితంగా హిట్ అని ఫీల్ అవుతాడట. గంగోత్రి, ఆర్య, బన్నీ, దేశముదురు, జులాయి సినిమాలు అక్కడ తీసారట. విలన్ కమ్ హీరో గోపీచంద్ అయితే తన సినిమా టైటిల్ చివర్లో సున్నా వుండేలా చుసుకుంటాడట. హీరోయిన్ల విషయానికొస్తే కాజల్ షూటింగ్ తొలిరోజు తప్పకుండా తెల్లదుస్తులలోనే వస్తుందట.
మరి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ ల మాటేమిటి అంటారా? శ్రీనువైట్ల విడుదలకు ముందు సింహాచలం వెళ్తాడట. పూరికి స్క్రిప్ట్ బ్యాంకాక్ లో రాయడం సెంటిమెంట్. నిర్మాత దిల్ రాజుకి, బండ్ల గణేష్ కి తిరుపతి సెంటిమెంట్ అధికం. మునుపటి తరం లెజెండరీ దర్శకులు కే విశ్వనాద్ ఖాకీ దుస్తులలోనే షూటింగ్ చేస్తారట. బాగున్నాయి కదూ వీరి సెంటిమెంట్లు..