Begin typing your search above and press return to search.
ఇలా చేస్తే అభిమానులకు గుండె కోతే
By: Tupaki Desk | 21 Dec 2015 1:30 PM GMTమొన్న ఉదయ్ కిరణ్ .. నిన్న రంగనాథ్ .. అంతకుముందు ఇంకెందరో... నటీనటులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మధ్యనే తెలుగువారి అభిమాన తార ఆర్తి అగర్వాల్ లైపో సక్సెమీ ఫెయిల్యూర్ తో మరణించింది. ఇవన్నీ ఎవరికి వారు ఆత్మశోధన చేసుకునే ఘటనలే. మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకునే అన్ ఎక్స్ పెక్టెడ్ థింగ్స్. ఒక సాధారణ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి.. ఒక సెలబ్రిటీ ఆత్మహత్య చేసుకోవడానికి మధ్య ఎంతో తేడా ఉంటుంది. వెండితెర సామ్రాజ్ఞులుగా వెలిగిపోయే నటీనటులకు బోలెడంత మంది అభిమానులు ఉంటారు. లక్షలు, కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. అయ్యయ్యో .. ఇలా చేశారేంటి? అని అంతమంది గుండెలు అవిసిపోతాయి.
ఎన్నో ఏళ్లుగా నటరంగానికి సేవలందించారు సీనియర్ నటులు రంగనాథ్. హీరోగా - విలన్ గా - క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒకటేమిటి .. అన్నిరకాలుగా నటించి తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయారు. ఆ స్ఫురద్రూపం అంత తేలిగ్గా మర్చిపోయేది కాదు. 66 వయసులో ఆయనకి ఏం కష్టం వచ్చిందని ఆత్మ హత్య చేసుకున్నారు? ఇన్నాళ్ల నటజీవితంలో ఆయన రారాజుగా వెలిగిపోయి ఎందుకిలా చేశారు? అన్న ఆత్మఘోష అభిమానులకు మిగిలిందిప్పుడు. అంత పెద్ద నటుడు ఇలా చేసుకున్నారేంటి? అన్న ఆందోళన అభిమానుల్ని కుంగదీసింది. జీవితం క్షణభంగురం.. అది సెలబ్రిటీకైనా, సామాన్యుడి కైనా ఒక్కటే. సెలబ్రిటీలు దివ్యతారలుగా వెలిగిపోయి అంతర్థానం అవుతారు. సామాన్యుడు చనిపోయినా ఎవరికీ తెలీదు. మూడు పదుల వయసులోనే అంతర్థానం అయ్యాడు హీరో ఉదయ్ కిరణ్. లవర్ బోయ్ అన్న పదానికి పర్యాయపదంగా వెలిగిపోయాడు. జీవితం దివ్యంగా వెలిగిపోతుందనుకున్న వేగుచుక్క ఒక్కసారిగా నేలరాలింది.
చివరి నిమిషంలో చివరి పుట్టినరోజున విలేకరులతో మాట్లాడుతూ.. లైఫ్ లో కొన్ని తప్పులు చేశాను. కాదనడం లేదు. కానీ ఏదీ తెలియక చేసినవే. వేడి పొంగులో చేసినవే అని ఒప్పుకున్న ఉదయ్ .. ఇక లేడు అన్న సంగతి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఓ బలహీన క్షణం ఆత్మహత్య చేసుకుంటాడని ఎవరూ అనుకోలేదు. ఇక ఆర్తి అగర్వాల్ నిండా 30 వయసు అయినా లేకుండానే ఎన్నో అనుభవాల్ని చవి చూసింది. ప్రేమలో వైఫల్యం.. కెరీర్ లో డౌన్ ఫాల్ ఆర్తి అగర్వాల్ ని కుంగదీశాయి. జీవితంలో నైరాశ్యం - నిర్లక్ష్యం అందాల తారను బలిగొన్నాయి. లైపో చేయించుకుని తిరిగి కెరీర్ ని వెలిగించుకోవాలన్న పట్టుదల దారుణంగా విఫలమైంది. ఏదేమైనా ఈ తారలంతా అభిమానులకు గుండె కోత మిగిల్చారు. ఇవన్నీ ఊహాతీతమైనవి. తప్పదు భరించాలి