Begin typing your search above and press return to search.
హైద్రాబాద్ బేబీ జోరు పెంచేసిందే... ?
By: Tupaki Desk | 31 Dec 2021 2:30 AM GMTయూత్ గుండెల్లో కొలువు తీరిన చిట్టి ఇపుడు గట్టిగానే పట్టు బిగిస్తోంది. జాతిరత్నాలుతో మెరిసిన హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా టాలీవుడ్ లో ఇపుడు కొత్తందంగా మెరిసిపోతోంది. ఫరియాకు 2021 బాగా కలసివచ్చింది. చిట్టిగా ఓవర్ నైట్ స్టార్ డమ్ సాధించిన ఈ అమ్మడు అక్కినేని వారి బంగార్రాజుతో బంగారు రాణి పాత్రని కొట్టేసింది. నాగ చైత్రన్య పక్కన ఐటెమ్ సాంగ్ తో పాటు కొన్ని కీలక సీన్లలో మెరవనుంది.
తొందరలో థియేటర్లలోకి ఈ మూవీ రానుంది. అక్కినేని హీరోతో ఫరియా పండించిన రొమాన్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతారనే అంటున్నారు. ఈ మూవీతో పాటుగానే సీనియర్ హీరో, మాస్ మహారాజా రవితేజా కొత్త సినిమాలో కూడా ఫరియా హీరోయిన్ గా లక్కీ ఆఫర్ దక్కించుకుంది.
అలాగే యంగ్ హీరో సంతోష్ శోభన్ పక్కన మరో సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇంకా మరిన్ని ఆఫర్లు తన ఖాతాలో వేసుకుంటూ యమ జోరు చేస్తున్న ఈ ఆరడుగుల పొడుగు సుందరికి టాలీవుడ్ బాగానే పెద్ద పీట వేస్తోంది అని చెప్పాలి.
ఫరియా అందంతో పాటు కట్టిపడేసే నటన ఈ చాన్సులు వచ్చేలా చేస్తున్నాయి అంటున్నారు. ఇప్పటిదాకా ముంబై ఫ్లైట్స్ నుంచి హీరోయిన్స్ ని తెచ్చుకునే టాలీవుడ్ కి తమ అడ్డాలోనే సరికొత్త అందం ఉందని తెలిసేలా ఫరియా చేసిందని అంటున్నారు.
కొత్త ఏడాది ఆశావహంగా ఉందని ఫరియా అంటోంది. బంగార్రాజు మూవీ మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇక రవితేజా సినిమా కూడా గ్యారంటీ హిట్ అనే అంటారు. ఇలా వరసబెట్టి రెండు మూడు హిట్లు పడితే కనుక ఫరియా టాలీవుడ్ లో నంబర్ల రేసులో ముందుకు దూసుకుపోవడం ఖాయమే అంటున్నారు. మొత్తానికి హైదరాబాద్ బేబీ టాలీవుడ్ కి హాట్ ఫేవరేట్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అంటున్నారు.