Begin typing your search above and press return to search.
కమెడియన్ల రెమ్యునరేషన్ కహానీ
By: Tupaki Desk | 20 Dec 2018 1:30 AM GMTటాలీవుడ్ లో ఇప్పుడున్న కమెడియన్ల లో డజను పైగా కమెడియన్లు క్షణం తీరిక లేకుండా బిజీ గా ఉంటున్నారు. అవకాశాల పరంగా కొదవేం లేదు. అయితే వీళ్ల పారితోషికాల రేంజు ఎలా ఉంది? అప్పట్లో బ్రహ్మానందం ఒక్కో కాల్షీటు (రోజుకి)కు రూ.5లక్షలు పారితోషికం అందుకున్నారన్న ప్రచారం సాగింది కదా? ఇప్పుడున్న స్టార్ కమెడియన్ల కు అదే రేంజు పారితోషికం ఉందా? అంటే .. `తుపాకి`తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడిన 30 ఇయర్స్ పృథ్వీ షాకిచ్చే నిజం చెప్పారు.
ఒక కాల్షీటు కు రూ.5లక్షల పారితోషికం అన్నది ఉట్టిదే. అది బ్రహ్మానందంతోనే పోయింది. ఇప్పుడు ఒక్కో సినిమా కి నలుగురైదుగురు కమెడియన్లు ఒకే రోల్ కి పోటీ గా ఉన్నారు. అందువల్ల పారితోషికాల రేంజు అంత లేదు. రూ.50వేలు ఇస్తే గొప్పేనని అన్నారు. బ్రహ్మానందం వరకూ ఆ లెవల్ చెల్లింది. ఆయన కు మాత్రమే అంత స్టామినా ఉంది. ఆ తర్వాత మళ్లీ ఆ వేవ్ నవతరం కమెడియన్లు చూపించలేకపోయారని, దాంతో పాటే కమెడియన్ల లో పోటీ పెరిగిందని అతడి మాటల్ని బట్టి అర్థమైంది. బ్రహ్మీ తర్వాత మళ్లీ అంత సీన్ ఎవరికీ కనిపించడం లేదన్న క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతం ఉన్న కమెడియన్లలో కాల్షీటుకు రూ. 20 వేల నుంచి రూ.50 వేల మధ్య గిట్టుబాటు అవుతోందట. 30 ఇయర్స్ పృథ్వీ- కృష్ణ భగవాన్- రఘుబాబు లాంటి కమెడియన్లకు మాత్రం రూ.50 వేల రేంజు ఉంటుంది. అయితే నెలంతా ఫుల్ బిజీ గా ఉండే సన్నివేశం ఉండాలన్న రూలేం లేదు. కమెడియన్ల కోసం రాసుకున్న సీన్లు అన్నిటినీ ఏదో మూడు నాలుగు రోజుల్లోనే దర్శకులు చుట్టేస్తారని షాకింగ్ ట్రూత్ ఒకటి చెప్పారు పృథ్వీ. అంటే ఆ నాలుగు రోజులకు రూ.2లక్షల్లోపే ఒక్కో సినిమాకి ముట్ట జెప్పుతారని భావించినా ఏడాదికి 20 సినిమాలు చేస్తే రూ.40-రూ.50లక్షల లోపే సంపాదన ఉంటుందని అర్థమైంది. గత ఏడాది ఏకంగా 40 సినిమాలు చేశానని చెప్పిన పృథ్వీ ఈ ఏడాది గ్రాఫ్ పడిపోయి 20 సినిమాలకే పరిమితమయ్యానని, అయితే చిన్న సినిమాలు తీసేవాళ్లు తగ్గడమే ఇందుకు కారణమని అన్నారు. చిన్న సినిమాల కు మార్కెట్ లేదు. శాటిలైట్, డిజిటల్ ఎప్పుడూ సమస్యే. అందుకే ఈ ఏడాది సినిమాలు తీసేవాళ్లు తగ్గారన్న షాకింగ్ నిజాన్ని చెప్పారు.
అసలింతకీ జబర్ధస్త్ గ్యాంగ్ లు, ఇతరత్రా చిన్నా చితకా కామెడీ లు చేసేవాళ్లు రోజు కు ఎంత తీసుకుంటారు? అంటే రూ.10 వేలు- రూ.20 వేల రేంజు లోపే ఉంటుందని పృథ్వీ ఇచ్చిన హింటును బట్టి తెలుస్తోంది. అయితే ఏడాదికి 100 సినిమాలు తీస్తే, అందులో 30-40 సినిమాల్ని చుట్టేసేవాళ్లు ఉంటారు. అందువల్ల బాగానే కిట్టుబాటు అవుతుంది కొందరికి. ఇక్కడ అవకాశాలు పట్టుకోగలిగితేనే సంపాదన.. అని అర్థమవుతోంది. ఇక కమెడియన్ల కష్టం కామెడీ డైరెక్టర్లు తగ్గడంతోనే మొదలైందన్నది మరో వాదన. ఈవీవీ వంటి వారు లేకపోవడం కమెడియన్లకు మైనస్ అయ్యింది. ఏవీఎస్- ధర్మవరపు- కొండవలస- ఎమ్మెస్ నారాయణ వంటి గొప్ప స్టార్ కమెడియన్స్ మరణానంతరం కామెడీ లో టింజ్ తగ్గిపోయింది. పైగా వాళ్లంతా విలువలతో బతికి ఇండస్ట్రీని బతికించారు. పదిమందికి అవకాశాలు కల్పించారని పృథ్వీ చెప్పారు.