Begin typing your search above and press return to search.

టాలీవుడ్ క్రైసిస్‌..ఆ ఇద్ద‌రు ఎక్క‌డ‌?

By:  Tupaki Desk   |   29 July 2022 2:58 PM GMT
టాలీవుడ్ క్రైసిస్‌..ఆ ఇద్ద‌రు ఎక్క‌డ‌?
X
క‌రోరా కార‌ణంగా అన్ని రంగాలకు మినహియింపులిచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మాత్రం సినిమా థియేట‌ర్లు రీఓపెనింగ్‌, షూటింగ్ ల‌కు అమతులు ఇవ్వ‌లేదు. దీంతో చాలా వ‌ర‌కు పూర్తి కావాల్సిన సినిమాలు మ‌ధ్య‌లోనే ఆగిపోయిన నిర్మాత‌లు ఆర్ధిక భారంతో నానా ఇబ్బందులు ప‌డ్డారు. ఇక సినిమాల నిర్మాణం ముందుకు సాగ‌దా?.. థియేట‌ర్లు రీఓపెన్ కావా? అనే ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ స‌మ‌యంలో ఇండ‌స్ట్రీ కోసం ముందుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున‌.

ఈ ఇద్ద‌రు ఉభ‌య తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలకు సంబంధించిన సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ల‌తో వేరు వేరుగా స‌మావేశ‌మై ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ని వివ‌రించారు. హీరోలు, నిర్మాత‌ల‌ కంటే కార్మికులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని, షూటింగ్ ల‌కు అనుమతులు ఇవ్వాల‌ని, అలాగే థియేట‌ర్లు రీఓపెన్ చేయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో మొత్తానికి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు, కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి కోవిడ్ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి షూటింగ్ లు చేసుకోవ‌చ్చ‌ని ఉత్త‌ర్వులు జారీ చేశారు.

అంతే కాకేండా యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు రీఓపెన్ చేసుకోవ‌చ్చ‌ని మ‌రో జీవోని విడుద‌ల చేశారు. దీంతో క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన సినిమాల‌న్నీ మ‌ళ్లీ కోవిడ్ నిబంధ‌న‌ల‌ని పాటిస్తూ షూటింగ్ లు మొద‌లు పెట్టాయి. చాలా వ‌ర‌కు పూర్తయి యాభై శాతం ఆక్యు పెన్సీతోనే సూప‌ర్ హిట్ లు అయ్యాయి, నిర్మాత‌ల‌కు భారీ లాభాల్ని తెచ్చిపెట్టాయి. ఇక ఏపీతో నెల‌కొన్న టికెట్ రేట్ల వివాదంతో పాటు ప‌లు స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం, స్టార్ హీరోల సినిమాల‌కు టికెట్ రేట్ల‌ని భారీగా త‌గ్గించ‌డం వంటి కార‌ణాల‌తో చాలా వ‌ర‌కు తీవ్ర న‌ష్టాల‌ని చ‌వి చూశాయి.

ఈ స‌మ‌స్య‌ల‌ని ప‌రిష్క‌రించ‌డానికి మ‌ళ్లీ మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ తో స‌న్నిహిత సంబంధాలున్న నాగార్జున‌ను ముందుకు న‌డిచారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కార‌ణంగానే ఏపీ సీఎం ఇండ‌స్ట్రీపై క‌క్ష సాధిస్తున్నార‌ని, అందుకే ఆ స‌మ‌స్య‌ల‌ని మీరే తీర్చాలంటూ మెగాస్టార్ ని ఇండ‌స్ట్రీ ముందు పెట్టింటి. నాగ్ కూడా కొంత బాధ్య‌త తీసుకున్నారు. కీల‌క మీటింగ్ కి నాగార్జున వ్య‌క్తిగ‌త కార‌ణాల వల్ల హాజ‌రు కాలేక‌పోయినా మెగాస్టార్ చిరంజీవి బాధ్య‌త‌గా ఏపీ సీఎంని క‌లిశారు.

అదే క్ర‌మంలో స్టార్ హీరోలు ప్ర‌భాస్, మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్ట‌ర్స్ రాజ‌మౌళి, కొర‌టాల శివ కూడా వెళ్లి క‌లిశారు. ఇంత మంది దిగిరావ‌డంతో ఏపీ సీఎం సినీ రంగ స‌మ‌స్య‌ల‌పై సానుకూలంగా స్పందించి ఏపీలో టికెట్ రేట్ల‌ని పెంచుకునే వెసులుబాటుని క‌ల్పించారు. ఆ త‌రువాత పెద్ద సినిమాలు రిలీజ్ లు సాఫీగా సాగాయి. వారం పాటు పెద్ద సినిమాల‌కు టికెట్ రేట్లు పెంచుకునే విధంగా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా జీవోని కూడా విడుద‌ల చేసింది.

ఇంత చేసిన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ప్ర‌స్తుతం టాలీవుడ్ లో జ‌రుగుతున్న ప‌రిణామాల్లో క‌నిపించ‌డం లేదు. వారి పేర‌కు కూడా వినిపించ‌డం లేదు. ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్‌, తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి త‌ప్ప మ‌రో పేరు వినిపించ‌డం లేదు. ఆగస్టు 1 నుంచి ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ షూటింగ్ ల బంద్ కు పిలుపు నిచ్చిన విష‌యం తెలిసిందే.

అయితే ఇంత జ‌రుగుతున్నా చిరు పేరు కానీ నాగార్జున పేరు కానీ నిర్మాత‌లు ఎత్త‌క‌పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. చిరు, నాగార్జున‌ కావాల‌నే తాజా వివాదానికి దూరంగా వుంటున్నార‌ని, ఈ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని ప్ర‌య‌త్నించిన ఏ ఒక్క‌రికీ చిరు అందు బాటులో వుండ‌టం లేద‌ని ఇండస్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.