Begin typing your search above and press return to search.

క్రిటిక్స్‌ నే క‌థ‌ల‌డుగుతున్నారా గురూ?

By:  Tupaki Desk   |   18 Nov 2015 10:30 PM GMT
క్రిటిక్స్‌ నే క‌థ‌ల‌డుగుతున్నారా గురూ?
X
సినిమానే శ్వాసించ‌డం.. సినిమాతోనే స‌హ‌జీవ‌నం చేయ‌డం కొంద‌రు క్రిటిక్స్ ప‌ని. వీళ్లు కేవ‌లం ఒక్క తెలుగు భాష‌లోని సినిమాల్నే కాదు.. వ‌ర‌ల్డ్ లాంగ్వేజెస్‌ లోని అన్ని సినిమాల్ని చూస్తుంటారు. అందుకే ఫ‌లానా సినిమా ప‌లానా హాలీవుడ్ సినిమాకి కాపీ అనో, ఫ‌లానా పోస్ట‌ర్ ఫ‌లానా చోటి నుంచి లిఫ్ట్ చేసేశార‌నో ఇట్టే చెప్పేస్తుంటారు. మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎంత అడ్వాన్స్‌ గా ఉంటారో అంత‌కుమించి అడ్వాన్స్‌డ్‌ గా ఉంటారు క్రిటిక్స్‌. అయితే స‌రిగ్గా ఇదే పాయింట్ అటు క్రిటిక్స్‌కి క‌లిసొచ్చేట్టే ఉంది.

ఇటీవ‌లి కాలంలో స్టార్ డైరెక్ట‌ర్ల నుంచి కూడా అట్ట‌ర్‌ ఫ్లాప్‌ లొస్తున్నాయి. స్టార్ హీరోలు న‌టించిన రొటీన్ సినిమాల్ని ప్రేక్ష‌కులు నిర్ధ‌య‌గా తిర‌స్క‌రిస్తున్నారు. అందుకే ఇప్పుడు స్టోరీలు ఇన్నోవేటివ్‌ గా ఉండాల‌ని అంతా ఆలోచిస్తున్నారు. టాలీవుడ్‌ లో ఇదో కొత్త ప‌రిణామం. అంతేకాదు మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ న‌వ్య‌పంథా క‌థ‌ల్ని ఎంపిక చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అలాంటి స్ర్కిప్టులు రాయాల్సిందిగా యువ‌రచ‌యిత‌ల‌కు సూచిస్తున్నారు.

అవ‌స‌ర‌మైతే కొరియ‌న్‌ - ఫ్రెంచ్‌ - జ‌ర్మ‌న్ ఫిలింస్ నుంచి ఏదైనా న‌చ్చితే ఆ లైన్‌ ని తెలుగైజ్ చేయ‌మ‌ని ద‌ర్శ‌కనిర్మాత‌లే ర‌చ‌యిత‌ల‌కు పుర‌మాయిస్తున్నారు. డీవీడీలు కొనిచ్చి వాటిలోని లైన్‌ ని తీసుకుని కొత్త‌గా ఇంకేదైనా తెలుగైజ్ చేయాల్సిందిగా అడిగేస్తున్నారు. అందుకోసం అవ‌స‌ర‌మైతే క్రిటిక్స్ నుంచి స‌ల‌హాలు తీసుకుంటున్నారు. ఏమైనా ఉంటే చెప్పండి గురూ.. అంటున్నారు. అప్ప‌ట్లో పూరి జ‌గ‌న్నాథ్ అంత‌టివాడే నాకు క‌థ‌లు కావాలి అంటూ మీడియా జర్నలిస్టులను అడిగాడు. ఇప్పుడు నిర్మాతలు కూడా వీరినే అడగటం విశేషం.