Begin typing your search above and press return to search.
రవితేజ తమ్ముడిని మోసం చేసిన డైరెక్టర్?
By: Tupaki Desk | 27 Jun 2017 12:39 PM GMTమరో సినీ ప్రముఖుడి జీవితం అర్ధంతరంగంగా ముగిసిపోయింది. రవితేజ తమ్ముడు భరత్ తేజ తనువు చాలించాడు. వర్ణరంజితంగా కనిపించే సినీ ప్రపంచంలోని ప్రతికూల కోణాల్ని భరత్ మరోసారి బయటపెట్టింది. ఈ తరుణంలో అసలు భరత్ సినిమాల్లోకి ఎలా వచ్చాడు.. అంతకుముందు అతనేం చేసేవాడు.. అన్న మౌలికమైన ప్రశ్నలు తలెత్తడం సహజం. నిజానికి భరత్ ను సినిమాల్లోకి తీసుకొచ్చింది రవితేజ కాదట.
సినిమాల్లోకి రాకముందు ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని తనతో కలిసి అమెరికాలో సెటిలయ్యాడట భరత్. అక్కడే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తూ సంతోషంగా జీవనం సాగించేవారట. ఐతే అమెరికాలో తానా సభల కోసం వచ్చిన ఓ టాలీవుడ్ కామెడీ డైరెక్టర్.. భరత్ ను చూసి సినిమా అవకాశం ఇప్పిస్తానని అన్నాడట. రవితేజ లాగే ఉన్నావ్.. నిన్ను పెట్టి సినిమా తీస్తా అంటూ అతడికి ఆఫర్ ఇచ్చాడట. దీంతో భరత్ హైదరాబాద్ వచ్చేసినట్లు సమాచారం.
కానీ తీరా ఇక్కడికి వచ్చాక ఆ దర్శకుడు ముఖం చాటేశాడట. హీరోగా కాదు కదా.. చిన్న పాత్ర కూడా అతడికి ఇవ్వలేదు. ఐతే వేరే సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు దక్కడంతో ఇక్కడే సెటిలైపోయాడు భరత్. ఐతే ఆ సంపాదన సరిపోక అడ్డదారులు తొక్కడం.. అన్నయ్య మీద ఆధారపడటం.. చెడు అలవాట్లకు బానిస కావడం.. ఇలా భరత్ జీవితం అనూహ్య మలుపులు తిరిగింది. భార్యతో విభేదాలొచ్చి తనకూ దూరమయ్యాడు. చివరికి అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ రోజు ఆ దర్శకుడు భరత్ లో సినిమా ఆశలు రేకెత్తించకుండా ఉంటే అతడి జీవితం సాఫీగా సాగిపోయేదన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/