Begin typing your search above and press return to search.
రివ్యూ రైటర్లను బుట్టలో వేశారయ్యా
By: Tupaki Desk | 12 Aug 2017 12:30 AM GMTరివ్యూలు రాసేవాళ్ళను పెద్దగా పట్టించుకోను అని చెప్పి ఒక పెద్దాయన పెద్ద ఘనకార్యమే చేశారు. అర్రే ఆ రివ్యూలు రాసేవారికి అంత ఐక్యూ ఉంటే తీసుకెళ్ళి వారితో యాపిల్ కంపెనీ వంటివి పెట్టించండి అన్నారు. అసలు రివ్యూలే చదవను అంటూ ఏకేశారు. కాని అది రివ్యూ రైటర్లను ఆయన చాలా తెలివిగా బుట్టలో వేశారండోయ్.
ఈ శుక్రవారం రిలీజైన ఒక సినిమాలో.. అప్పట్లో వచ్చిన లీడర్ సినిమాలో సిఎం పనితీరును చూసి కొందరు న్యూస్ యాంకర్లు స్టూడియోలు వదిలేసి వెళ్ళి ఆయన చేసే పాదయాత్రలో తేలతారు చూడండి.. అదే తరహాలో ఇప్పుడు ఈ సినిమాలో టైలరింగ్ చేసుకునే ఒక వ్యక్తి.. ఇంక ఇతర చిన్నచిన్న పనులు చేసుకునేవారు.. వెళ్లి ఓ రాజకీయ నాయకుడి పక్కనే చేరతారు. సారీ.. చేరడానికి వెళతారు. అయితే ఈ పాత్రలను పోషించింది ఎవరో కాదు.. కొందరు పాపులర్ సో కాల్డ్ ఫిలిం క్రిటిక్స్. అసలు సదరు దర్శకుడు విడిగా క్రిటిక్స్ ను బూతులు తిట్టి.. తన సినిమాలో మాత్రం ఇలా పాపులర్ క్రిటిక్స్ కు యాక్టింగ్ ఛాన్సులు ఇవ్వడమేందబ్బా? ఇడ్డూరంగా ఉంది కదూ.
మొత్తానికి ఈయన రివ్యూ రైటర్లకు ఈ విధంగా భలే బిస్కెట్లు వేశారు అని చెప్పుకుంటున్నారు జనాలు. ఎందుకంటే రానున్న రోజుల్లో వేరే రివ్యూ రైటర్లు ఎవరైనా కూడా.. ఆ సినిమాలో వాళ్లకి ఛాన్సిచ్చినట్లు ఇప్పుడు మనకు కూడా ఏమన్నా ఛాన్సిస్తాడేమో అని ఫీలై.. సదరు డైరక్టర్ గురించి సినిమా గురించి బ్యాడ్ గా రాయకుండా ఉంటారనేమో. ఈయన తెలివికి ఓ ఐదు స్టార్లు పడేసుకోవాల్సిందే.