Begin typing your search above and press return to search.

మ‌న ద‌గ్గ‌ర‌ బేరాల్లేవ‌మ్మా.. అంతా ప్యాకేజీ దందానే

By:  Tupaki Desk   |   13 April 2022 8:02 AM GMT
మ‌న ద‌గ్గ‌ర‌ బేరాల్లేవ‌మ్మా.. అంతా ప్యాకేజీ దందానే
X
మ‌న టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ మ‌న ద‌గ్గ‌ర బేరాల్లేవ‌మ్మా అంటున్నారు. టాలీవుడ్ సినిమాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా రాజ‌మౌళి పుణ్య‌మా అని మంచి మార్కెట్ ఏర్ప‌డింది. భారీ స్థాయిలో మ‌న సినిమాలు బిజినెస్ జ‌రుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని హీరోలు, స్టార్ డైరెక్ట‌ర్స్ ప్యాకేజీల‌కే మొగ్గుచూపుతున్నారు. ఒక్కో డైరెక్ట‌ర్, ఒక్కో హీరో ఒక్కోలా త‌మ డిమాండ్ ని బ‌ట్టి ప్యాకేజీని డిమాండ్ చేస్తుండ‌టం ఇప్ప‌డు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇలా ప్యాకేజీల ఫార్ములా కొంత మందికి లాభాల్ని తెచ్చిపెడుతుంటే మ‌రి కొంత మందికి భారీ స్థాయిలో న‌ష్టాల‌ని కూడా అందిస్తోంది. రాజ‌మౌళి నుంచి మారుతి వ‌ర‌కు స్టార్ డైరెక్ట‌ర్స్ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.

ఇక స్టార్ హీరోల్లోనూ ఇదే పంథా కొన‌సాగుతోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ , ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం వ‌ర‌కు అంతా మ‌న ద‌గ్గ‌ర బేరాల్లేవ‌మ్మా.. అంతా ప్యాకేజీ దందానే అంటూ డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ముందు టాలీవుడ్ లో ఈ ప్యాకేజీ దందాని స్టార్ట్ చేసింది వివాదాస్ప‌ద చిత్రాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. 'ర‌క్త చ‌రిత్ర‌' నుంచి దాదాపుగా ఈ ప్యాకేజీ దందాని వ‌ర్మ మొద‌లుపెట్టిన‌ట్టుగా చెబుతున్నారు.

'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి వ‌ర్మ అందుకున్న మొత్తం ప్యాకేజీ 13 కోట్ల‌ట‌. అయితే ఈ చిత్రాన్ని పూర్తి చేసింది మాత్రం 2.5 కోట్ల‌లో అని తెలిసింది. అంటే వ‌ర్మ దాదాపుగా ఈ సినిమాకు 10.5 కోట్లు తీసుకున్నార‌న్న‌మాట‌. ఆ త‌రువాత రూపొందించిన చిత్రాల‌కు కూడా వ‌ర్మ ఇదే పంథాని అనుస‌రిస్తూ కోట్లు ప్యాకేజీ అందుకుంటూ అత్యంత త‌క్కువ బ‌డ్జెట్ ల‌లో సినిమాల‌ని చుట్టేస్తూ వ‌స్తున్నారు. పారితోషికం కాకుండా మొత్తం ప్యాకేజీలో సింహ భాగం ద‌క్కించుకుంటూ అందులో 15 శాతం డ‌బ్బుతో మాత్ర‌మే సినిమాలు నిర్మిస్తూ రిలీజ్ కు ముందే కోట్ల‌ల్లో సొంతం చేసుకుంటున్నారు.

ఇదే ఇదే త‌ర‌హాలో ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి కూడా 'బాహుబ‌లి' నుంచి ప్యాకేజీ ఫార్ములాని ఫాలో అవుతున్నారు. స్టోరీ ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ అందిస్తే డైరెక్ష‌న్ టీమ్ బాధ్య‌త‌ల్ని త‌న‌యుడు కార్తీకేయ చూసుకుంటారు. కీర‌వాణి సంగీతం అందిస్తే ఇత‌ర విభాగాల‌ని ఎస్‌.ఎస్ . కంచీ, రామా రాజ‌మౌళి, కీర‌వాణి స‌తీమ‌ణి శ్రీ‌వ‌ల్లి చూసుకుంటారు. ఇందుకు గానూ రాజ‌మౌళికి ఫ్యామిలీ ప్యాకేజ్ భారీగానే అందుతోంది. వీరి పారితోషికాల‌తో పాటు రాజ‌మౌళి సినిమా లాభాల్లో వాటాని కూడా ద‌క్కించుకుంటున్నారట‌.

'బాహుబ‌లి' రెండు భాగాల‌కు గానూ రాజ‌మౌళి అందుకున్న మొత్తం 50 కోట్లు అని వార్త‌లు వినిపించాయి. దానికి మించే వుంటుద‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల వాద‌న‌. ఇక ఇటీవ‌ల విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ 'ట్రిపుల్ ఆర్‌' దాదాపు 80 కోట్లు పారితోషికం అందుకున్న జ‌క్క‌న్న లాభాల్లో 30 శాతం వాటాని కూడా డిమాండ్ చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అంటే ఈ ఫిగ‌ర్ భారీగానే వుండే అవ‌కాశం వుందని చెబుతున్నారు. ఇదే పంథాలో చాలా మంది టాలీవుడ్ డైరెక్ట‌ర్ లు ఫాలో అవుతున్నార‌ట‌.

మారుతి కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ వ‌రుస చిత్రాల‌ని బ్యాక్ టు బ్యాక్ పూర్తి చేస్తున్నారు. లాభాల్ని సొంతం చేసుకుంటున్నారు. ఇక స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ కూడా 'పుష్ప‌' తో ప్యాకేజీ ఫార్మాట్ లోకి ఎంత‌రైన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. పార్ట్ 1 పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో పార్ట్ 2 కి ప్యాకేజీని డిమాండ్ చేస్తున్నార‌ని, హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ని అడిగేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా దాదాపుగా 50 కోట్ల‌తో ప్యాకేజీని డిమాండ్ చేస్తున్నార‌ట‌. మ‌హేష్ బాబు కూడా త‌న సినిమాకు త‌న జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ని కూడా క‌లిపేస్తూ వాటా అందుకుంటుండ‌టం ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌హేష్ ఈ ఫార్ములాని 'శ్రీ‌మంతుడు' మూవీ నుంచి స్టార్ట్ చేశారు. ప్ర‌స్తుతం చేస్తున్న 'స‌ర్కారు వారి పాట‌'కు కూడా ఈ ఫార్ములానే అమ‌లు చేస్తున్నారు. వీరి బాట‌లోనే యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం కూడా అప్పుడే ప్యాకేజీ ఫార్ములాని పాటిస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

మైత్రీ మూవీ మేక‌ర్స్ ఆ హీరోతో 9 కోట్ల ప్యాకేజీని మాట్లాడుకుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇలా చాలా వ‌ర‌కు స్టార్ డైరెక్ట‌ర్ లు, హీరోలు ప్యాకేజీ ఫార్ములాని అమ‌లు ప‌రుస్తుండ‌టం ఇప్ప‌డు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.