Begin typing your search above and press return to search.
మా కంటెంట్ అంటే.. మా కంటెంట్!!
By: Tupaki Desk | 26 Feb 2016 4:33 AM GMTమాది అంటే మాది.. మా కంటెంట్ సూపర్ అంటే మా కంటెంట్ సూపర్.. ప్రస్తుతం మన దర్శకుల వరుస ఇలా ఉంది. ఈరోజు రిలీజయ్యే క్షణం అండ్ పడేశావే సినిమాల నుండి.. వచ్చే శుక్రవారం విడుదలయ్యే సినిమాల వరకు అందరూ ఇదే సైరన్ మోగిస్తున్నారు.
''క్షణం'' సినిమా హిట్టవ్వడానికి ఇందులో థ్రిల్లర్ ఎలిమెంట్స్ మెయిన్ రీజన్ అవుతాయి అంటున్నాడు తొలి చిత్రం దర్శకుడు రవికాంత్ పేరెపు. అందుకే ఈ సినిమా ఎలాగైనా హిట్టవుతుంది అనే కాన్ఫిడెన్సుతో ఉన్నాడు. ఇక ''పడేశావే'' టీమ్ కూడా అంతే. దర్శకురాలు చునియా కూడా ఈ రొమాంటిక్ కామెడీ సూపర్బ్ గా ఉంటుంది అంటోంది. నాగార్జున బ్యాకింగ్ తో హిట్టు గ్యారంటీ అని చెబుతోంది.
వచ్చే వారం సంగతులు చూస్తే.. పెళ్ళయిన అర్బన్ కపుల్స్ తాలూకు మనోభావాలతో.. ''కళ్యాణ్ వైభోగమే'' చింపేశాం అంటోంది నందిని రెడ్డి. కంటెంట్ ఖచ్చితంగా క్లిక్కవుతుందట. డార్క్ కామెడీ తరహాలో సాగే ఈ కన్ఫ్యూజన్ కామెడీ.. ఎట్టి పరిస్థితుల్లో సూపర్ హిట్టే అంటున్నాడు ప్రవీణ్ సత్తారు. ఇంతవరకు కమర్షియల్ సక్సెస్ ను చవిచూడని ఈ దర్శకుడు ఇప్పుడు మాత్రం బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే అని చెప్పుకొచ్చాడు. దశరథ్ కూడా అంతే. టాలీవుడ్ లో చాలా సంవత్సరాల నుండి ఎవరూ టచ్ చేయని ఒక పాయింట్ తో ఒక అద్భుతమైన థ్రిల్లర్ గా ''శౌర్య'' సినిమాను తీశాడట. ఈసారి హిట్టు గ్యారంటీ అని చెబుతున్నాడు. ఇక తమిళ రీమేక్ అయినప్పటికీ.. ''తుంటరి'' ఒక రేంజులో ఉండబోతోందని దర్శకుడు కుమార్ నాగేంద్ర కూడా సెలవిచ్చాడు.
మొత్తానికి మా కంటెంట్ సూపర్ అంటే మా కంటెంట్ సూపర్ అంటూ దర్శకులందరూ ఈసారి కాన్ఫిడెంటుగా దరువేస్తున్నారు. చూద్దాం ఎవరి కంటెంట్ నిజంగా సూపర్బ్ గా ఉండబోతోందో!!