Begin typing your search above and press return to search.

ఫారిన్‌ కథలు.. అలా కష్టమొచ్చింది

By:  Tupaki Desk   |   15 Dec 2015 5:30 PM GMT
ఫారిన్‌ కథలు.. అలా కష్టమొచ్చింది
X
ఈ మధ్యన కొత్త కథలు ఎక్కువగా రావట్లేదు అనే ఎక్కువమంది విమర్శిస్తున్నారు. ఒకప్పుడు పూరి జగన్‌ వంటి దర్శకులు సైతం కొరియా సినిమాల నుండి కొత్త కొత్త స్టోరీ పాయింట్‌ లను పట్టుకొస్తున్నారని క్రేజ్‌ ఉండేది. ఇప్పుడేమో హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ లు ఉన్నా కూడా.. ఎందుకో ఎక్కడా ఏదీ సెట్టవ్వట్లేదు . పాత చింతకాయ్‌ పచ్చడే వస్తోంది. కారణం ఏంటంటారు?

నిజానికి పూరి జగన్‌ కొరియా సినిమాలను చూస్తున్నాడు అనగానే.. అందరూ వాటి మీదనే పడ్డారు. ప్రేమ కథా చిత్రమ్‌ వంటి సినిమాలు కూడా కొరియాలో హిట్టయిన బ్లాక్‌ బస్టర్‌ లకు ఫ్రీమేక్స్‌. అయితే సడన్‌ గా ఈ విషయం పబ్లిక్‌ అయిపోవడం వలన.. అందరూ కొరియన్‌ సినిమాలను చూడ్డం స్టార్టు చేశారు. సుకుమార్‌ ఫ్రెంచి సినిమాలను.. శ్రీను వైట్ల జర్మన్‌ సినిమాలను చూసి.. లైలా మూవీ ఆధారంగా కుమారి 21 ఎఫ్‌.. గుడ్‌ బాయ్‌ లెనిన్‌ ఆధారంగా దూకుడు వంటి సినిమాలను చేశారు. మరి ఇప్పుడు కూడా అదే విధంగా కొత్త కొత్త కథలను పట్టుకురావొచ్చుగా?? కొత్త కథలతో సినిమాలు తీయొచ్చుగా? ఫ్రీమేక్‌ తప్పని తెలుసు.. కాని అంతకంటే తప్పట్లేదు మరి.

అయితే తలనొప్పి మ్యాటర్‌ ఏంటంటే.. అప్పట్లో ఎవరో ఒకరు సినిమా చూసి.. దానిని తెలుగు కథగా కూర్చి.. అందరికీ చెప్పడం వలన.. అది అందరికీ నచ్చేది. ఇప్పుడేమో అందరూ సదరు ఫారిన్‌ సినిమాలను చూసేస్తున్నారు కాబట్టి.. ఎవరికి వారు ఆ సినిమాను ఎలా ఎడాప్ట్‌ చేసుకోవచ్చు అనే సలహా ఇస్తున్నారే కాని.. కథా పరంగా ఒకే తాటిపై నడవలేకపోతున్నారు. అందుకే మనోళ్లు ఫారిన్‌ స్టోరీలను ఎక్కవగా లేపేయలకపోతున్నారట. అర్రే.. ఎంత కష్టమొచ్చిందో!!