Begin typing your search above and press return to search.
ఈ దర్శకులకు సినిమాలు ఎందుకు లేవు..?
By: Tupaki Desk | 12 Feb 2016 7:30 PM GMTహిట్ లేని చిన్న చిన్న డైరెక్టర్లు కూడా ఒకటి అరా చిత్రాలతో బిజీగా ఉంటూ నిర్మాతలను ఇట్టే బుట్టలో పడేస్తూ సినిమాల్లో బిజీ అవుతున్నారు. కానీ టాలీవుడ్ లో టాలెంట్ ఉన్నప్పటికీ ఇద్దరు ముగ్గురు దర్శకులకు చేతిలో సినిమాలు లేకపోవడం.. వారు ఖాళీగా ఉండటం చాలా విచిత్రంగా కనిపిస్తోంది. 'రచ్చ - బెంగాల్ టైగర్' చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న సంపత్ నంది ఇప్పటికీ తన తదుపరి చిత్రంపై నోరు విప్పడం లేదు. ఇక 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ - ఎక్స్ ప్రెస్ రాజా'లతో తనేమిటో ప్రూవ్ చేసుకున్న మేర్లపాక గాంధీ రామ్ చరణ్ కు - నాగచైతన్యకు స్టోరీలు చెప్పాడనే వార్తలు మినహా ఆయన ఇప్పటికీ తన తదుపరి చిత్రంపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు.
ఇక 'గబ్బర్ సింగ్'తో ఆకాశాన్ని తాకే ఇమేజ్ ను సంపాదించుకొని, ఆ తర్వాత 'రామయ్యా..వస్తావయ్యా'తో డిజాస్టర్ అందుకున్న హరీష్ శంకర్ కు ఆ వెంటనే అవకాశాలు రాలేదంటే నిజమే అనుకోవచ్చు. కానీ ఆయన 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'తో కమర్షియల్ గా ఓకే అయిన సినిమా చేసిన తర్వాత కూడా ఆయన తదుపరి చిత్రం ఎవరితో? ఎప్పుడు? అనేది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. వీరితో పాటు 'ఉయ్యాలజంపాల' చిత్రంతో టాలీవుడ్ కు రాజ్ తరుణ్ లాంటి మంచి హీరోని, అవికాగోర్ లాంటి మంచి హీరోయిన్ ను అందించి సినిమాను కూడా సూపర్ హిట్ చేసిన విరించి వర్మకు మరో చిత్రం ఇప్పటికీ వర్కౌట్ కాకపోవడం విధి విచిత్రమే అనాలి మరి..!