Begin typing your search above and press return to search.
గ్రాఫిక్సుతో పెట్టుకుంటే కష్టం సుమీ
By: Tupaki Desk | 17 Nov 2015 4:02 AM GMTమన దగ్గరంతే. ఒక సినిమా గ్రాఫిక్సుతో వచ్చి హిట్టు కొట్టిందంటే.. ఇక అలాంటివే చాలా స్టోరీలు వస్తుంటాయ్. అందుకే దేవి హిట్టయితే దేవిపుత్రుడు ఫ్లాప్. అరుంధతి హిట్టయ్యాక అనగనగా ఓ ధీరుడు ఫ్లాప్. ఇలా మనోళ్ళు గ్రాఫిక్సునే నమ్ముకొని కథలో పట్టు కథనంలో దమ్ము.. అసలు గ్రాఫిక్స్ క్వాలిటీ అనేది లేకుండా ఎన్నోసార్లు మునిగిపోయారు.
ఇప్పుడు నయా సినిమాల విషయానికొస్తే.. బాహుబలి తరువాత తెలుగులో గ్రాఫిక్సు సినిమాలు చేయాలంటే కాస్త షేకవ్వాల్సిందే. క్వాలిటీలో కాస్త తేడా వచ్చినా 'రుద్రమదేవి' టైపులో కామెంట్లు వేయించుకోవాల్సిందే. కామెడీగా ఉండే బొమ్మల గ్రాఫిక్స్ చూపిస్తే విజయ్ 'పులి' ఏమైంది? అలాగని మోడ్రన్ డే సినిమాల్లో గ్రాఫిక్స్ కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి. లేకపోతే 'అఖిల్' సినిమా టైపులో కార్టూన్ నెట్వర్క్ లా తయారయ్యే ఛాన్సుంది. త్వరలో రానున్న సినిమాల్లో దాదాపు అన్నింటిలోనూ ఎంతోకొంత గ్రాఫిక్సు వర్కు ఉన్నా.. ఓ రెండు సినిమాల గురించి మాత్రం కాస్త గట్టిగా వినిపిస్తోంది.
సందీప్ కిషన్ కొత్త సినిమాలో ఏకంగా 40 నిమిషాల గ్రాఫిక్సు ఉందట. ఇకపోతే కృష్ణవంశీ అనుకుంటున్న రుద్రాక్ష కూడా మొత్తంగా ఈ కంప్యూటర్ జిమ్మిక్కుల చుట్టూతానే తిరుగుతుందట. కేవలం కోట్ల బడ్జెట్ ఒక్కటే కాదు.. గ్రాఫిక్స్ అంటే విజువలైజేషన్ తో పాటు ఏ టెక్నాలజీతో ఏ ఎఫెక్టు సాదిద్దాం అనే క్లారిటీ డైరక్టర్ కే ఉండాలి. అప్పుడు హాలీవుడ్ స్థాయి.. అబ్బే.. కనీసం బాహుబలి స్థాయి అందుకోవడానికి ఏదైనా ఛాన్సుంటుంది. అనవసరంగా గ్రాఫిక్సుతో పెట్టుకుంటే మాత్రం.. పేకప్పే సుమీ!!