Begin typing your search above and press return to search.
డైరెక్టర్లు అన్యాయమైపోతున్నారే...
By: Tupaki Desk | 7 Feb 2017 10:30 PM GMTడైరెక్టర్ని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. ఒక సినిమా హిట్టయినా.. ఫ్లాప్ అయినా.. ఆ క్రెడిట్ ప్రధానంగా దర్శకుడికే చెందాలి. ఐతే కొత్త ఏడాది వరుస సూపర్ హిట్లతో టాలీవుడ్ కళకళలాడిపోతోంది కానీ.. ఆ చిత్రాల దర్శకులకు మాత్రం అనుకున్నంత పేరు రావట్లేదు. ఈ ఏడాది ఇప్పటికే టాలీవుడ్ నాలుగు భారీ విజయాల్ని ఖాతాలో వేసుకుంది. అందులో సినిమా సక్సెస్ తాలూకు క్రెడిట్ సరిగ్గా దర్శకుడికి అందిందంటే అది ఒక్క ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలోనే. ఈ చిత్ర రూపకర్త క్రిష్ ప్రశంసల వర్షంలో తడిసి ముద్దయ్యాయి. మామూలుగా బాలయ్య సినిమాలకు ఈ స్థాయిలో దర్శకుడికి క్రెడిట్ రావడం అరుదు.
ఐతే మిగతా సినిమాల విషయంలో దర్శకులకు సరైన క్రెడిట్ దక్కలేదు. సంక్రాంతి హైయెస్ట్ గ్రాసర్ ‘ఖైదీ నెంబర్ 150’ విషయంలో వి.వి.వినాయక్ కు వచ్చిన పేరేమీ లేదు. మొత్తం క్రెడిట్ అంతా చిరు ఖాతాలోకి వెళ్లిపోయిది. రీమేక్ సినిమా కావడం.. కథాకథనాల విషయంలో దాదాపుగా ఒరిజినల్నే ఫాలో అయిపోవడంతో సినిమా ఎంత పెద్ద హిట్టయినా వినాయక్ కు ప్రశంసలు దక్కలేదు. ఐతే ‘ఖైదీ నెంబర్ 150’ రీమేక్ కాబట్టి వినాయక్ కు పెద్దగా ప్రశంసలు రాలేదనుకుందాం ఓకే.. కానీ ‘శతమానం భవతి’ చిన్న సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టినప్పటికీ సతీశ్ వేగేశ్నకు క్రెడిట్ దక్కకపోవడం విడ్డూరమే. అతను తీసిన గత రెండు సినిమాలు ఫ్లాపవడం.. ‘శతమానం..’కు దిల్ రాజు అన్నీ తానై వ్యవహరించాడన్న పేరు రావడంతో సతీశ్ కు అనుకున్నంత పేరు రాలేదు. ఐతే సతీశ్ ప్రశంసలకు పూర్తిగా అర్హుడు. అయినా అతణ్ని చాలామంది విస్మరించారు. దిల్ రాజునే ఆకాశానికెత్తేశారు.
ఇక టాలీవుడ్ లేటెస్ట్ హిట్ ‘నేను లోకల్’ విషయంలోనూ దర్శకుడి పేరు పెద్దగా వినిపించట్లేదు. టాప్ ఫాంలో ఉన్న నాని మరోసారి మామూలు సినిమాకే తన పెర్ఫామెన్స్ తో వెయిట్ తీసుకురావడంతో అందరూ అతణ్నే పొగిడేస్తున్నారు. కొంచెం క్రెడిట్ దిల్ రాజుకు.. ఇంకొంత క్రెడిట్ రైటర్ ప్రసన్నకు ఇస్తున్నారు. త్రినాథరావుకూ ప్రశంసలు దక్కుతున్నాయి కానీ.. సినిమా విజయానికి తగ్గట్లు మాత్రం కాదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/