Begin typing your search above and press return to search.
విమర్శల్ని తట్టుకోలేకపోతున్నారు
By: Tupaki Desk | 12 April 2015 5:30 PM GMTఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో ఓ వింతైన పరిస్థితి నెలకొంది. అంతర్జాలంలో వచ్చే సినిమా రివ్యూల విషయంలో కొందరు బహిరంగంగానే అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. అందులో దిగ్గజాలు అనతగ్గవారున్నారు.
నిన్నటికి నిన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సూటిగానే ఈ విషయంలో అసహనాన్ని వెల్లగక్కారు. రివ్యూలు రాసేవాళ్లు సినిమాని ఎంజాయ్ చేయరు. చూస్తున్నంతసేపూ వేరే లోకంలో ఉంటారు. లోపాల్ని వెతకడమే పనిగా పెట్టుకుంటారు. అలా కాకుండా ఓ సామాన్యుడిలా సినిమా చూసి సమీక్షించాలి అని క్లాస్ పీకారు. ఇప్పుడు అదే బాటలో సుహాసిని మణిరత్నం సైతం మీడియాపై ఫైరయ్యారు. 23ఏళ్లుగా సినిమాలు తీస్తున్నాం. ఏది మంచి సినిమానో మాకు తెలీదా? సమీక్షలు రాసేవాళ్లంతా అపరిపక్వంగా ఉన్నారంటూ విరుచుకు పడ్డారు.
అప్పట్లో ఎస్.ఎస్.రాజమౌళి అంతటి దర్శకుడే తన సినిమాలో కాపీ సీన్లు అంటూ లీకులు వెతుకుతున్న సమీక్షకులపై గుర్రుమన్నారు. హరీష్ శంకర్ సైతం గతంలో మీడియాని వెంట్రును తీసేసినట్టే తీసేశారు. ఇక రామ్ గోపాల్ వర్మ అండ్ బ్యాచ్ అయితే రివ్యూలు రాసేవాళ్లను వెర్రివెంగలప్పాయ్‌లు అని భావిస్తుంటారు. కొందరైతే సినిమా తీస్తే తెలుస్తుంది. రాసేవాళ్లకేం తెలుసు వంకాయ్! అనేస్తారు... ఇలా ఏదో రకంగా మీడియా సదరు పెద్దల దృష్టిలో హీనమైపోయింది. ఒకవేళ సమీక్షకులేమైనా తమపై తామే సమీక్షించుకుంటున్నారా? అంటే అదీ లేదు.
ఎదుటివారు ఏం ఏడుస్తారు? అనే కంటే ఆ క్షణంలో ఆ సినిమాపై తమ అభిప్రాయం ఏమిటో అది మాత్రమే రాయడం తమ పని. దానికి ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకో ఎవరికీ ఎప్పటికీ అర్థం కానిది. అసలింతకీ ఈ సమస్యకి పరిష్కారం ఎప్పటికి వస్తుందంటారు?