Begin typing your search above and press return to search.

50 లేకపోతే తీయలేరా డైరెక్టర్లూ?

By:  Tupaki Desk   |   27 Jan 2016 3:30 PM GMT
50 లేకపోతే తీయలేరా డైరెక్టర్లూ?
X
బాలీవుడ్ తర్వాత దేశంలోనే అత్యధిక సంఖ్యలో సినిమాలు తీసే ఇండస్ట్రీ టాలీవుడ్. మన సినీ పరిశ్రమలో ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు ఉన్నారు కానీ.. స్టార్ డైరెక్టర్లుగా వెలిగిపోతున్న వాళ్లతో ఓ తంటా వచ్చిపడుతోంది. వీళ్లు ఏ సినిమా తీసినా బడ్జెట్ లెక్కలు 50 దాటిపోతున్నాయి. హీరో స్టామినా ఎంతో, ఎంత రికవర్ చేయగలడు అనే అంచనాలు లేకుండా, తాము తీసిన ప్రతీ మూవీకి నిర్మాతలతో యాభై ఖర్చు పెట్టించేస్తున్నారు.

మొన్నటివరకూ టాలీవుడ్ లో 50 కోట్లను రికవర్ చేయగల హీరోలు పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు - రామ్ చరణ్ - అల్లు అర్జున్. రీసెంట్ గా ఈ లిస్ట్ లోకి ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యారు. వీళ్లకి తప్ప.. వేరే ఏ స్థాయిలో ఉన్న హీరోకి కూడా యాభై వసూలు చేసిన క్రెడిట్ లేదు. కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా రాలేదు. మరి డైరెక్టర్లేమో ఎవరితో తీసినా కనీసం 50 కోట్లు చొప్పున ఖర్చు చేసేస్తుండడం.. సమస్యగా తయారవుతోంది.

ఆయా హీరోల స్టామినా కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టించడంతో.. సినిమాకి వసూళ్లు వచ్చినా చివరకు కాస్ట్ ఫెయిల్యూర్ అనిపించుకోవాల్సి వస్తోంది. మరి బడ్జెట్ లేకుండా క్వాలిటీ రాదా అంటే.. డైరెక్టర్ మారుతిని ఈ విషయంలో ప్రశంసించాల్సిందే. తను తీసిన ప్రతీ మూవీకి.. బడ్జెట్ కంటే ఐదారు రెట్లు వసూళ్లు చేయగలిగాడు. వసూళ్ల సంగతి పక్కన పెట్టినా, తక్కువ ఖర్చులోనే ఎక్కువ క్వాలిటీతో ఔట్ పుట్ తేగలుగుతున్నాడు. మరి మారుతి లాంటి బడ్జెట్ కంట్రోల్ స్ట్రాటజీని మిగతా డైరెక్టర్లు కూడా అలవర్చుకుంటే.. టాలీవుడ్ లో హిట్ మూవీల సంఖ్య బాగా పెరుగుతుంది.