Begin typing your search above and press return to search.
2018 రివ్యూ : సౌత్ లో టాలీవుడ్ ఆదిపత్యం
By: Tupaki Desk | 18 Dec 2018 1:30 AM GMTకాలగమనం లో మరో సంవత్సరం కలిసి పోబోతుంది. మరో పది రోజుల్లో క్యాలెండర్ మారబోతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రేక్షకులను అలరించేందుకు భారీ ఎత్తున సినిమాలు వచ్చాయి. సౌత్ సినీ పరిశ్రమ పరిధి మరింతగా పెరగడంతో పాటు- బడ్జెట్- కలెక్షన్స్ ఇలా అన్ని విషయాల్లో కూడా పెరిగింది. కొన్నాళ్ల ముందు వరకు వంద కోట్ల సినిమాలు ఒకటి రెండు ఉండేవి. కాని ఈ సంవత్సరం మాత్రం సౌత్ సినీ ఇండస్ట్రీ లో నాలుగు సినిమాలు వంద కోట్లకు పైగా షేర్ ను దక్కించుకున్నాయి.
సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ 20 సినిమాలు తీసుకుంటే అందులో మెజార్టీ సినిమాలు టాలీవుడ్ సినిమాలు ఉండగా, ఆ తర్వాత స్థానంలో తమిళ సినిమాలు నిలిచాయి. టాప్ లో అంతా అనుకున్నట్లుగానే 2.ఓ చిత్రం నిలిచింది. ఆ తర్వాత స్థానంలో సర్కార్ చిత్రం ఉంది. ఇక టాప్ 5 చిత్రాల్లో ‘రంగస్థలం’ మరియ ‘భరత్ అనే నేను’ చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా వంద కోట్లకు పైగా షేర్ ను దక్కించుకున్నాయి.
టాప్ టెన్ చిత్రాల్లో ఆరు తెలుగు సినిమాలు స్థానం దక్కించుకోవడం విశేషం. పెద్దగా సక్సెస్ కాలేదు అంటూ విమర్శలు ఎదుర్కొన్న అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం కూడా టాప్ 10 చిత్రాల జాబితాలో నిలిచింది. ఈ ఏడాదిలో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 20 చిత్రాల్లో తెలుగు సినిమా పరిశ్రమ నుండి 8 చిత్రాలు స్థానం దక్కించుకున్నాయి. వచ్చే ఏడాది ఇంతకు మించిన విజయాలను టాలీవుడ్ దక్కించుకుంటుందనే నమ్మకం తెలుగు సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.