Begin typing your search above and press return to search.
జనవరిలో టాలీవుడ్ డబుల్ ధమాకా ట్రీట్
By: Tupaki Desk | 22 Dec 2022 8:02 AM GMT2023 జనవరిలో వినోదపరిశ్రమ ప్రత్యేక శోభను సంతరించుకోనుంది. ఓవైపు థియేటర్ల ముందు కిటకిట... మరోవైపు స్టూడియోల్లో పూజా కార్యక్రమాలతో రంగుల వైభవం అభిమానుల కళ్లెదుట ప్రత్యక్షం కానున్నాయి. ఈ సంక్రాంతి బరిలో చిరంజీవి- బాలకృష్ణ సినిమాలు (వాల్తేరు వీరయ్య వర్సెస్ వీర సింహారెడ్డి) నువ్వా నేనా? అంటూ పోటీపడబోతుంటే.. ఇతర స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి క్యూలో ఉన్నాయి. ముఖ్యంగా తమిళ అనువాద చిత్రం వారసుడుతో దళపతి విజయ్ మన హీరోలకు పోటీగా దిగుతున్నాడు.
ఇంతలోనే బ్యాక్ టు బ్యాక్ పూజా కార్యక్రమాలకు సంక్రాంతి మంథ్ ఆధారంగా నిలవబోతోంది. 2023 జనవరి ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ సుజీత్- హరీష్ శంకర్ ల సినిమాలతో బిజీ కానున్నారు. ఇవి రెండూ సైమల్టేనియస్ గా పట్టాలెక్కుతాయని అవసరం మేర పవన్ ఇరువురికి తన కాల్షీట్లను అడ్జెస్ట్ చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నెల రెండో వారంలో త్రివిక్రమ్ తో మహేష్ SSMB 28 రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించనున్నారు.
సంక్రాంతి సీజన్ తర్వాత అల్లు అర్జున్ 'పుష్ప 2' షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. జనవరిలోనే ఏదో ఒక సమయంలో కొరటాల శివతో ఎన్టీఆర్ 30ని ప్రారంభించనున్నారు.
ఇలా వరుస లాంచ్ లతో జనవరి కిటకిటలాడబోతోంది. తమ అభిమాన తారల సినిమాల లాంచింగ్ వేడుకల్లో సందడి చేసేందుకు కొందరు వీరాభిమానులు ప్రిపరేషన్ లో ఉంటారన్నది తెలిసిందే. ఇప్పటికే ఏ స్టూడియోలో ఏ స్టార్ హీరో సినిమా ప్రారంభం కానుంది అన్నదానిపై జాబితా ప్రిపేర్ చేస్తున్నారు.
రిలీజ్ లు ఓపెనింగులతో జనవరి కళకళలాడితే ఆ తర్వాత కూడా ఈ సందడి తగ్గే ఛాన్స్ లేదని చెబుతున్నారు. కొత్త సంవత్సరం మొదటి త్రైమాసికం టాలీవుడ్ సూపర్ స్టార్ లు పవన్ కల్యాణ్ -మహేష్ బాబు- జూనియర్ ఎన్టీఆర్-అల్లు అర్జున్ - రామ్ చరణ్ సహా పలువురు హీరోలు పూర్తి బిజీగా ఉండనున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికే వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇక డిసెంబర్ 31 .. సంక్రాంతి సీజన్ లో ప్రభాస్ సినిమాల నుంచి వరుస గ్లింప్స్ రిలీజవుతాయని కూడా అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్ స్టార్ లంతా జనవరిలో బిజీబిజీగా మారుతున్నారు. ఇది వారి అభిమానులకు ఆసక్తి కలిగించే విషయం. అలాగే వచ్చే ఏడాది ప్రథమార్థంలో బాక్సాఫీస్ లు బద్ధలు కొట్టే భారీ చిత్రాలు రిలీజవుతుండడం కూడా అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా పరిగణించాలి. 2023లో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న రెండు భారీ చిత్రాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.