Begin typing your search above and press return to search.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: దూకుడు పెంచిన ఈడీ..!

By:  Tupaki Desk   |   27 Aug 2021 1:30 PM GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: దూకుడు పెంచిన ఈడీ..!
X
నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసు మళ్ళీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎక్సైజ్ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చిన ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈ క్రమంలో గతంలో ఎక్సైజ్ పోలీసులు విచారించిన పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి వారిని మళ్ళీ విచారించినట్లు తెలుస్తోంది.

2017లో డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ కాబడిన కెల్విన్ - పీటర్ - కమింగా వంటి నిందితుల స్టేట్‌మెంట్స్ ను ఈడీ రికార్డు చేసింది. ఈ ముగ్గురి స్టేట్‌మెంట్ల ఆధారంగానే టాలీవుడ్ సెలబ్రిటీలకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. డార్క్ వెబ్ ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్ వచ్చినట్లుగా తెలిపిన నిందితులు.. హవాలా రూపంలో డబ్బులు చెల్లించినట్లుగా ఈడీ విచారణలో వెల్లడించారట. హీరో నవదీప్‌ కు చెందిన ఓ క్లబ్ కు డ్రగ్స్ సరఫరా జరిగినట్టుగా ఈడీ అధికారులు చెబుతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే క్లబ్‌ మేనేజర్‌ కు నోటీసులు జారీ చేశారు.

మరోవైపు కెల్విన్ - పీటర్ - కమింగాకు సంబంధించిన బ్యాంక్ ట్రాన్సక్షన్స్ తో పాటుగా ఆన్‌ లైన్‌ లావాదేవీలను కూడా ఈడీ పరిశీలిస్తోంది. ఇకపోతే ఈ కేసులో పూరీ జగన్నాథ్ - దగ్గుబాటి రానా - రకుల్ ప్రీత్ సింగ్ - చార్మీ కౌర్ - రవితేజ - ముమైత్ ఖాన్ - నందు - నవదీప్ - తరుణ్ - తనీష్ లతో పాటు రవితేజ డ్రైవర్ లకు ఈడీ నోటీసులు పంపించింది. వీరందరినీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు ఈడీ విచారించనున్నారు. డ్రగ్స్ క్రయవిక్రయాలకు సంబంధించి ఈడీ వీరిని కేవలం సాక్షులుగానే పరిగణించి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.