Begin typing your search above and press return to search.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: దూకుడు పెంచిన ఈడీ..!
By: Tupaki Desk | 7 Sep 2021 5:30 PM GMT2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలోకి విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో పలువురికి నోటీసులు పంపి ఈడీ విచారణ ప్రారంభించింది. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే పూరీ జగన్నాథ్ - ఛార్మీ కౌర్ - రకుల్ ప్రీత్ సింగ్ లని అధికారులు ప్రశ్నించారు. ఈరోజు మంగళవారం హీరో నందు ని విచారించారు. అదే సమయంలో ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న కెల్విన్ కి కూడా ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు.
ఈరోజు ఉదయం నుంచి డ్రగ్స్ నిందితులైన కెల్విన్ - కుద్దిస్ - వాహిద్ ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ.. ముగ్గురిని విచారణకు తరలించారు. ముగ్గురు నిందితులు ఇళ్లల్లో లాప్ టాప్స్ - సెల్ ఫోన్స్ - ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ లని స్వాధీనపరుచుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురిని విడివిడిగా ఈడీ విచారణ చేస్తోందని తెలుస్తోంది. నటుడు నందును కూడా కెల్విన్ సమక్షంలో ప్రశ్నించారని.. సుమారు నాలుగు గంటల పాటు ఈ విచారణ సాగిందని కథనాలు వస్తున్నాయి.
డ్రగ్స్ కేసులో కెల్విన్ పేరు మొదటి నుంచీ ప్రముఖంగా వినిపిస్తోంది. కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకే పాతబస్తీకి చెందిన కుదూస్ - వాహిద్ లను ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారిస్తున్నారని తెలుస్తోంది. కెల్విన్ తో విదేశాల్లో ఉన్న పరిచయంతో వీరిద్దరూ హైదరాబాద్ లో డ్రగ్స్ దందా నడిపినట్లు సమాచారం. డ్రగ్స్ సరఫరా - ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయనే కోణంలో ఈడీ అధికారులు వీరిని ప్రశ్నిస్తున్నారు. సిఆర్ఫీఎఫ్ సిబ్బంది సహాయంతో కెల్విన్ ను ఈడీ ఆఫీస్ కు తీసుకొచ్చారని తెలుస్తోంది.
ఇకపోతే ఈడీ విచారణకు హాజరైన నందు ను.. తన బ్యాంక్ స్టేట్మెంట్స్ ను సమర్పించారు. మనీ లాండరింగ్ కోణంలో అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. అయితే నందు సెప్టెంబర్ 20న హాజరుకావాల్సి ఉండగా.. ముందుగానే ఈడీ ఎదుట విచారణకు వచ్చారు. ఈడీ అధికారులు ముందుగా రమ్మన్నారా? లేక వ్యక్తిగత కారణాలతో నందు ముందుగా హాజరయ్యారా? అనేది తెలియాల్సి ఉంది. ఇంతకముందు రకుల్ ప్రీత్ సింగ్ కూడా మూడు రోజుల ముందే ఈడీ విచారణకు వచ్చిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో రానా దగ్గుబాటి - రవితేజ - ముమైత్ ఖాన్ - నవదీప్ - తరుణ్ - తనీష్ వంటి సినీ ప్రముఖులు ఈడీ ఎదుట హాజరు కానున్నారు.