Begin typing your search above and press return to search.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఏం జరుగుతోంది?
By: Tupaki Desk | 26 April 2022 2:30 AM GMTడ్రగ్స్ కేసు గత కొంత కాలంగా టాలీవుడ్ లో ప్రకంపణలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎక్సైజ్ శాఖ తమకు సహకరించడం లేదంటూ ఇటీవల ఈడీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హై కోర్టులో విచారణ జరిగింది. అయితే న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడంలో అలస్యమైనందుకు బేషరతుగా క్షమాపణలు కోరారు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్. పాలనా పరమైన కారణాలతో ఈడీకి సమాచారం ఇవ్వడం ఆలస్యమైందని కోర్టుకు విన్నవించుకున్నారాయన.
ఈ సందర్భంగా ఈడీ విచారణకు హజరయ్యేందుకు సిద్ధమంటూ వెల్లడించారు. అంతే కాకుండా కోర్టు దిక్కరణ కేసుని కొట్టివేయాలని వేడుకున్నారు. కోర్టు దిక్కరణ పిటీషన్ లో వాదనలకు కొంత సమయం కోరింది ఈడీ. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన వివరాలు అదేశాల మేరకు వున్నాయో లేదో పరిశీలించాలని కోరింది. అయితే ఈ విచారణని వేసవి సెలవుల తరువాత చేపడతామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ - ఈడీ కోర్టు దిక్కరణ కేసుని కొట్టివేయాలని హై కోర్టును రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కోరారు.
ఈడీ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేసిన సర్ఫరాజ్ అహ్మద్ మార్చి 21న ఈడీకి 828 పేజీలతో వివరాలు ఇచ్చామని పేర్కొన్నారు. కోర్టులకు సమర్పించిన డిజిటల్ సాక్ష్యల వివరాలతో పాటు కెల్విన్ కేసులో సేకరించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లు ఈడీకి ఇచ్చామని స్పష్టం చేశారు. నిందితుల నుంచి కాల్ డేటా రికార్డులను దర్యాప్తు అధికారులు సేకరించలేదన్న సర్ఫరాజ్ అహ్మద్ సిట్ సేకరించిన 12 మంది కాల్ డేటా, వీడియో రికార్డింగ్ లని ఈడీకి అందజేశామని తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించాలన్న ఉద్దేశ్యం తమకు లేదని పేర్కొన్నారు. పాలనాపరిమైన కారణాలతో ఈడీకి సమాచారం ఇవ్వడం ఆలస్యమైందని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల అమలులో ఆలస్యం జరిగినందున ఎక్సైజ్ డైరెక్టర్ ఉన్నత న్యాయస్థానాన్ని ఈసందర్భంగా బేషరతుగా క్షమాపణలు కోరడం చర్చనీయాంశంగా మారింది. వేసవి సెలవుల అనంతరం విచారణ ప్రారంభం కానున్న ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.