Begin typing your search above and press return to search.

టాలీవుడ్: ఇండోర్ లో చేసే పనులకు కూడా మంగళం!

By:  Tupaki Desk   |   27 March 2020 11:10 AM GMT
టాలీవుడ్: ఇండోర్ లో చేసే పనులకు కూడా మంగళం!
X
కరోనా ప్రభావం దాదాపుగా అన్నీ రంగాల పైన పడిందనేది సుస్పష్టం. సినీ పరిశ్రమ సంగతే తీసుకుంటే మొదటి దశలో థియేటర్లు మూత పడ్డాయి. రెండవ దశలో షూటింగులు ఆగిపోయాయి. దీంతో దాదాపుగా టాలీవుడ్ లో కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. అయితే ఇండోర్ కార్యకలాపాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివాటిలో కథలు వండడం.. కథలువినడం లాంటివి మాత్రం నిరాఘాటంగా కొనసాగుతూనే ఉన్నాయి.

ఇవి కాకుండా కొన్ని సినిమాలకు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయట. కొందరు నిర్మాతలు తమ సొంత ఆఫీసుల్లో.. ఇతర ప్రదేశాలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు సీక్రెట్ గా చేయించుకుంటున్నారని సమాచారం. అయితే ఈ పనులు కూడా ఈరోజుతో ఆగిపోయాయని విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ పనులు చేస్తున్న టెక్నిషియన్స్ ప్రస్తుతం పరిస్థితులు.. డిమాండ్ కారణంగా తమ పనికి డబల్ బేటా డిమాండ్ చేయడంతో నిర్మాతలు ససేమిరా అన్నారట. అసలే షూటింగులు నిలిచిపోవడం.. రిలీజులు వాయిదా పడడంతో నష్టాలు వస్తున్నాయని.. ఇలాంటి సమయంలో ఎక్కువ బేటా చెల్లించే ప్రసక్తే లేదని నిర్మాతలు తేల్చి చెప్పడంతో పనులు ఆగిపోయాయట.

దీంతో ఈ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు రహస్యంగా జరుగుతున్న విషయం బయటకు వచ్చింది. లాక్ డౌన్ సడలించిన తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ ఈ పనులు అన్నీ ఆగినట్టేనని అంటున్నారు. అందుకు ఎన్ని రోజులు పడుతుందో.. ఎప్పుడు సినీ పరిశ్రమ బిజీగా మారుతుందో అన్నది వేచి చూడాలి.