Begin typing your search above and press return to search.
2020 సంక్రాంతి బరిలో ఫ్యామిలీ పుంజులు
By: Tupaki Desk | 11 Nov 2019 10:56 AM GMTసంక్రాంతి పందెం అంటే అభిమానుల్లో ప్రత్యేకించి చర్చ సాగుతుంటుంది. హీరోల మధ్య నువ్వా నేనా? అంటూ సాగే బిగ్ ఫైట్ ని కోరుకుంటారు. టాలీవుడ్ నుంచి ఫ్యామిలీ హీరోలు బరిలో దిగితేనే ఇది సాధ్యం. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ సంక్రాంతి బరిలో వస్తున్నారు అంటే.. మెగా-నందమూరి ఫ్యాన్స్ మధ్య హోరా హోరీ రసరమ్యంగా ఉండేది. గోడ పోస్టర్ రోజుల్లో అదో ట్రెండ్ సెట్టింగ్ మూవ్ మెంట్.
ఆ తర్వాతి కాలంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ .. సూపర్ స్టార్ మహేష్ మధ్య పోటీతత్వం ఉన్నా సంక్రాంతి బరిలో పోటీపడింది తక్కువే. సూపర్ స్టార్ మహేష్ .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఒకట్రెండు సార్లు ఈ పోటీ కనిపించింది. చరణ్ ఎవడు.. మహేష్ 1 నేనొక్కడినే చిత్రాలు అప్పట్లో సంక్రాంతి బరిలో పోటాపోటీగా వస్తే `ఎవడు` హిట్టు కొట్టింది. 1నేనొక్కడినే చిత్రం నిరాశపరిచింది. ఇక సీనియర్లలో చిరంజీవి.. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన క్రమంలో అప్పటికి ఉన్న ఇతర సీనియర్ హీరోలెవరూ సంక్రాంతి బరి లో పెద్దంతగా పోటా పోటీగా దిగిన వాతావరణం కనిపించ లేదు. ఇటీవల అయితే అసలు ఆ పోటీతత్వం కనిపించడం లేదు.
మరి ఈసారి 2020 సంక్రాంతి బరిలో ఎలా ఉండబోతోంది? ఫ్యామిలీ హీరోల సన్ని వేశమేమిటి? అంటే.. ఈసారి ప్రధానం గా ఘట్టమనేని.. మెగా హీరోల మధ్య నే పోటీ అని అర్థమవుతోంది. సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న `సరిలేరు నీకెవ్వరు`.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `అల వైకుంఠపురములో` చిత్రాలు ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్నాయి. జనవరి 11న మహేష్ సినిమా.. జనవరి 12న బన్ని సినిమా రిలీజవుతాయి. స్టార్ డమ్ దృష్ట్యా సంక్రాంతి పుంజులు అంటే ఆ ఇద్దరే. వారి మధ్య రసవత్తరమైన పోటీ ఉండనుందని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ సంక్రాంతి వరకూ వేచి చూడకుండా డిసెంబర్ 20న రిలీజ్ ని ఫిక్స్ చేశారు. దీంతో ఎ న్బీ కే సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నట్టయ్యింది. బాబాయ్ స్థానం లో కళ్యాణ్ రామ్ సంక్రాంతికి వస్తున్నాడు. జనవరి 14న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన `ఎంత మంచి వాడవు రా` రిలీజవుతోంది. పెద్ద హీరోలతో పోటీపడుతూ కళ్యాణ్ రామ్ డేర్ చేయడం ఆసక్తికరం. ఒక రకంగా ఈ సంక్రాంతి కి ఘట్టమనేని హీరో.. మెగా హీరో.. నందమూరి హీరో ఇలా ఫ్యామిలీ హీరోలు పోటీపడుతున్నా.. బన్ని-మహేష్ వార్ పైనే అభిమానుల ఫోకస్ ఎక్కువగా ఉండనుంది. వీరి తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న దర్బార్ రిలీజవుతోంది. కానీ అది డబ్బింగ్ చిత్రం కాబట్టి మెగా-ఘట్టమ నేని-నందమూరి ఫ్యాన్స్ పట్టించుకునే ఛాన్సే లేదు.
మును ముందు సంక్రాంతి రేస్ లో మహేష్ -చరణ్- ఎన్టీఆర్-ప్రభాస్ - బన్ని లాంటి అగ్ర కథా నాయకులు ఒకరి తో ఒకరు పోటీ పడే ఛాన్సుంది. అయితే అలాంటి సన్నివేశం చాలా అరుదు గానే కుదరుతుందని చెప్పాలి. ఇటీవల భారీ చిత్రాల్ని ఒకదాని పై ఒకటి పోటీ కి రాకుండా ప్లాన్ చేస్తుండడం తో అసలు హోరా హోరీ వాతావరణం తగ్గిందనే చెప్పాలి. పైగా టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒకరితో ఒకరు గొప్ప స్నేహ సంబంధాలు కొనసాగిస్తుండడం కూడా ఈ పోటీతత్వం తగ్గడానికి కారణమైంది. పోటీ లేకుండా వచ్చి బంపర్ హిట్లు కొట్టడం అన్న ఫార్ములాని మన నిర్మాతలు అనుసరిస్తుండడంతో ఫ్యాన్స్ కి ఆ కిక్కు మిస్సవుతోంది. ఏదో అభిమానుల వరకూ సోషల్ మీడియాలో పోటీ పడుతూ ఒకరినొకరు విమర్శించు కోవడం వరకే వార్ పరిమితమవుతోంది.