Begin typing your search above and press return to search.

రివ‌ర్స్ గేర్ వేసిన ఫాద‌ర్-స‌న్ కాంబినేష‌న్స్!

By:  Tupaki Desk   |   7 May 2022 3:30 AM GMT
రివ‌ర్స్ గేర్ వేసిన ఫాద‌ర్-స‌న్ కాంబినేష‌న్స్!
X
స్టార్స్ కాంబినేష‌న్స్ అంటేనే అంచ‌నాలు ప‌తాక స్థాయికి చేర‌తాయి. ఒకే ప్రేమ్ లో ఇద్ద‌రు స్టార్ హీరోలు క‌నిపిస్తే అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతాయి. మ‌ల్టీస్టార‌ర్ హ‌వా కొన‌సాగినంత‌కాలం అదే రేంజ్ హైప్ క్రియేట్ అయింది. ఇక తండ్రీత‌న‌యులు ఒకే ప్రేమ్ లో క‌నిపిస్తే ఇంకేస్థాయిలో అంచ‌నాలుంటాయో చెప్పాల్సిన‌ల ప‌నిలేదు.

బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డులు షురూ చేయ‌డం ఖాయ‌మంటూ ఓ రేంజ్ లో మీడియా హీటెక్కిస్తుంది. ప‌రిశ్ర‌మ చ‌రిత్ర‌లోనే చిర స్థాయిగా నిలిచిపోయే చిత్రాల‌వుతాయ‌ని ప్రేక్ష‌కాభిమానులు భావిస్తుంటారు. కానీ ఈ కాంబినేష‌న్స్ ఏవి బాక్సాఫీస్ వ‌ద్ద స‌రైన ఫ‌లితాలు సాధించ‌లేద‌ని తెలుస్తోంది. నాటి-మేటి చిత్రాల విశేషాల గురించి ఓ లుక్ ఏస్తే ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలుస్తున్నాయి.

ఇటీవ‌లే చిరంజీవి- రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `ఆచార్య` ఇటీవ‌ల‌ రిలీజ్ అయి ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. ఇద్ద‌రు బిగ్ స్టార్లు ఉండ‌టంతో రిలీజ్ కి ముందు ఇండ‌స్ర్టీ రికార్డులు తిర‌గ‌రాయ‌డం ఖాయ‌మంటూ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ కొన్ని కొన్ని వైఫ‌ల్యాలు సినిమాను ఆ స్థాయిక తీసుకెళ్ల‌లేకపోయాయి. ఇక స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు- చిన్న కుమారుడు బాల‌కృష్ణ క‌లిసి చాలా హిట్ సినిమాల్లో న‌టించారు.

ఎన్నో అంచ‌నాల‌మ‌ధ్య రిలీజ్ అయిన `అక్బ‌ర్ స‌లీం అనార్క‌లీ` మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద విఫ‌ల‌మైంది. ఆ త‌ర్వాత వ‌చ్చిన `బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర‌` కూడా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. ఇక అక్కినేని నాగేశ్వ‌ర‌రావు-నాగార్జున కాంబినేష‌న్ లో వ‌చ్చిన రెండ‌వ చిత్రం `అగ్నిపుత్రుడు` కూడా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయింది. అలాగే ఇదే క‌లయిక‌లో వ‌చ్చిన `ఇద్ద‌రు ఇద్ద‌రే` కూడా అంచ‌నాల్ని అందుకోలేక పోయింది.

అలాగే సూప‌ర్ స్టార్ కృష్ణ‌- మ‌హేష్ లు కూడా చాలా సినిమాల్లో న‌టించారు. మ‌హేష్ పూర్తి స్థాయి హీరోగా మారిన త‌ర్వాత తండ్రీ-కుమారులిద్ద‌రు `వంశీ`లో న‌టించారు. ఈ సినిమా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. ఆ త‌ర్వాత `ట‌క్క‌రి దొంగ‌`లో న‌టించారు. ఆ సినిమా కూడా నిరాశ ప‌రిచింది. ఇక మంచు మోహ‌న్ బాబు ఫ్యామిలీ న‌టులంతా క‌లిసి చేసిన `సూర్యం`..`గేమ్`..`గాయ‌త్రి`..`ఘుమ్మంది నాదం`.. `పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద` లాంటి సినిమాలు ఎలాంటి ఫ‌లితాలు సాధించాయో తెలిసిందే.

అలాగే ఆది-సాయికుమార్ న‌టించిన `చుట్టాల‌బ్బాయి` కూడా అదే వేవ్ లో వెళ్లిపోయింది. ఇంకా బ్ర‌హ్మానందం- ఆయ‌న త‌న‌యుడు గౌత‌మ్ క‌లిసి న‌టించిన `పల్ల‌కిలో పెళ్లికూతురు` ది అదే పరిస్థితి. ఇంకా కృష్ణం రాజు- ప్ర‌భాస్ న‌టించిన `రెబ‌ల్`...`బిల్లా`..`రాధేశ్యామ్` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయి చ‌తికిల ప‌డిన‌వే.