Begin typing your search above and press return to search.

ఆ హీరో పేరు ఎత్తితేనే నిర్మాత‌లు ల‌గెత్తుతున్నారా?

By:  Tupaki Desk   |   10 Aug 2022 3:30 PM GMT
ఆ హీరో పేరు ఎత్తితేనే నిర్మాత‌లు ల‌గెత్తుతున్నారా?
X
థియేట‌ర్ల‌కి జ‌నాలు ఎందుకు? రావ‌డం లేదు అన్న‌ది ఇటీవ‌ల విడుద‌లైన రెండు సినిమాల ఫ‌లితాల‌తో ఇండ‌స్ర్టీ స‌హా ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల‌కి ఓ క్లారిటీ వ‌చ్చింది. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే క‌టౌట్ తో పెద్ద‌గా ప‌నిలేద‌ని నిర్మాత‌లంతా ఊపిరి తీసుకుంటున్నారు. `బింబిసార‌`...`సీతారామం` సినిమాల‌కు ముందే ఇదే టాపిక్ పై నిర్మాత‌లంతా స‌మ‌వేశ‌మై భ‌విష్య‌త్ సినిమా ఎలా ఉండాలి ? అన్న‌ది దిశానిర్దేశం చేసుకున్నారు.

కోట్ల రూపాయ‌లు హీరోల‌కి ఖాతాల‌కు ట్రాన్స‌ప‌ర్ చేయ‌డం కాదు. ముందు ఆ హీరోతో చేసే సినిమా కంటెంట్ ఎలా ఉంది? అన్న‌ద పూర్తిగా విశ్లేషించుకున్న త‌ర్వాతే ముందుకెళ్లండ‌ని సీనియ‌ర్ నిర్మాత‌లు సూచించారు. దెబ్బ‌లు..ఎదురు దెబ్బ‌లు తిన్నారు కాబ‌ట్టి ఈసారి ప్ర‌తీ నిర్మాత కంటెంట్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకునే అవ‌కాశం ఉంది.

ఇక హీరోల ప‌రంగా చూసుకుంటే కొంత మంది స్టార్ హీరోలు ఇప్ప‌టికే కంటెంట్ ప‌రంగా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఎంపిక చేసుకునే క‌థ‌లో కొత్త‌ద‌నంతో పాటు క‌మ‌ర్శియ‌ల్ అంశాలు ఉండేలా చూసుకుంటున్నారు. కానీ ఆ ఒక్క హీరోలో మాత్రం ఇంకా ఇసుమొత్తు కూడా మార్పు రాలేద‌ని ఇటీవ‌ల రిలీజ్ అయిన రెండు సినిమాల ఫ‌లితాల‌తోనే అర్ధ‌మ‌వుతుంది.

ఆ మ‌ధ్య ట్రాక్ లోకి వ‌చ్చిన‌ట్లే క‌నిపించాడు గానీ మ‌ళ్లీ మూస ట్రాక్ లోనే వెళ్తున్నాడ‌ని మొన్న‌టి ఫ‌లితంతో క్లారిటీ వ‌చ్చేసింది. మ‌రి ఇప్పుడా హీరో ప‌రిస్థితి ఏంటి? అంటే ప్ర‌స్తుతానికి ప‌ర్వాలేదు. చేతిలో మూడు..నాలుగు ప్రాజెక్టులున్నాయి. కానీ ఆ నిర్మాత‌ల గుండెల్లో మాత్రం రైళ్లు ప‌రిగెట్టిస్తున్నాడ‌ని స‌మాచారం. చాలా మంది నిర్మాత‌లు హీరోని న‌మ్మే సినిమా చేస్తారు.

కాస్త విష‌యం ఉన్న నిర్మాత అయితే ద‌ర్శ‌కుడ్ని న‌మ్మి ముందుకెళ్తాడు. కానీ గ‌త రెండు ప‌రాజ‌యాల నేప‌థ్యంలో ఆ రెండు అంశాల‌న్ని న‌మ్మి ఆ హీరోతో ముందుకెళ్దామ‌న్నా? టెన్ష‌న్ మొద‌లైందిట‌. కోట్ల రూపాయలు పెడుతున్నాం తేడా? వ‌స్తే జ‌రిగితే ప‌రిస్థితి? ఏంటి అన్న‌ ఆలోచ‌న ఇప్ప‌టి నుంచే మొద‌లైంద‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది.

ఇక ఇప్ప‌టికే అడ్వాన్సులు చెల్లించిన నిర్మాత‌లైతే? పోతే పోయిన అడ్వాన్స్ ఇక్క‌డితే ఆగిపోవ‌డ‌మే మంచిద‌న్న ఆలోచ‌నకి వ‌చ్చేస్తున్నారుట‌. సినిమా చేసి పూర్తిగా చేతులు కాల్చుకోవ‌డం క‌న్నా? కొన్నాళ్ల పాటు అత‌ని జోలికి వెళ్ల‌కుండా కామ్ గా ఉండ‌ట‌మే మంచిదంటున్నారుట‌. మార్కెట్ ప‌రంగాను అత‌ని బ్రాండ్ ఇమేజ్ పై ప్ర‌తికూల వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఇవ‌న్నీ తొల‌గిపోవాలంటే? చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు అన్ని త‌ప్ప‌క విజ‌యం సాధించాలి. ఆ త‌ర్వాతే మ‌ళ్లీ న‌మ్మ‌కం ఏర్ప‌డేది. మ‌రి హీరోగారు ఏం చేస్తారో చూడాలి.