Begin typing your search above and press return to search.

హిందీ ప్రేక్షకుల టేస్ట్‌ మారింది.. మేకర్స్ మారలేదు

By:  Tupaki Desk   |   18 April 2022 5:01 AM GMT
హిందీ ప్రేక్షకుల టేస్ట్‌ మారింది.. మేకర్స్ మారలేదు
X
బాలీవుడ్‌ లో ఒకప్పుడు హిందీ సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధించాయి. సౌత్ సినిమా మేకర్స్ మరియు ప్రేక్షకులు ఆకాశం మాదిరిగా బాలీవుడ్‌ ను చూసే వారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. బాలీవుడ్ ప్రేక్షకులు ప్రస్తుతం సౌత్‌ సినిమాల వైపు చూస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాలు సూపర్‌ డూపర్ హిట్ అయ్యాయి.. కాని ఇప్పుడు అక్కడ సినిమాలు వరుసగా నిరాశ పర్చుతున్నాయి.

తెలుగు సినిమాలు ఇతర సౌత్‌ భాషల సినిమాలను హిందీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. తెలుగు సినిమాల్లో ఉండే యాక్షన్ ను హిందీ ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈమద్య కాలంలో హిందీల్ ప్రతి ఒక్క సౌత్‌ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. కారణం హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మన ఫిల్మ్‌ మేకర్స్‌ సినిమాలు చేస్తున్నారు.

ఒకప్పుడు హిందీలో లవ్ అండ్‌ రొమాంటిక్ సినిమాలకు మంచి డిమాండ ఉండేది. ఆ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. మాస్ మసాలా సినిమాలకు ఉత్తర భారతంలో పెద్దగా క్రేజ్ ఉండేది కాదు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. హిందీ ప్రేక్షకుల అభిరుచి మారింది. వారు ఆసక్తిని మార్చుకుని మాస్ సినిమాలను మరియు యాక్షన్ సినిమాలను ఇష్టపడుతున్నారు.

హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా హిందీ ఫిల్మ్‌ మేకర్స్ మారలేదు. వారు మునుపటి మాదిరిగానే పాత సినిమాలనే తీస్తున్నారు.. చేస్తున్నారు. మారుతున్న ట్రెండ్‌ కు అనుగుణంగా సినిమాలను ఉత్తరాది సినీ మేకర్స్ తీయలేక పోతున్నారు. అందుకే సౌత్ సినిమాలపై హిందీ ప్రేక్షకులు మోజు పడుతున్నారు.

ఇటీవలే బాలీవుడ్ స్టార్‌ హీరో ఒకరు మాట్లాడుతూ హిందీ ఫిల్మ్‌ మేకర్స్ హీరోయిజంను ఎలివేట్‌ చేసి చూపించలేక పోతున్నారు.. మాస్ సినిమాలను చేయలేక పోతున్నారు అంటూ బాహాటంగానే అనేశాడు. ఒకరు ఇద్దరు కమర్షియల్‌ దర్శకులు ఉన్నా కూడా వారు సౌత్ స్థాయి లో సినిమాలను చేయలేక పోతున్నారు అనేది టాక్‌.