Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో అసలు కథ ఇప్పుడే మొదలైందా?
By: Tupaki Desk | 29 July 2022 9:31 AM GMTటాలీవుడ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్ లు, అంత కంతకు పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం కొలిక్కి రావాలంటే ఆగస్టు 1 నుంచి సినిమాల షూటింగ్ లని నిరవధికంగా బంద్ చేయాల్సిందే అంటూ టాలీవుడ్ యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే తెలుగు సినిమా నిర్మాతల మండలి మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది.
బంద్ పాటించడం మీ వ్యక్తి గత వ్యవహారమని, మెజారిటీ ప్రొడ్యూసర్స్ కి దానికి ఎలాంటి సంబంధం లేదని కుండ బద్దలు కొట్టింది. ఇక నిర్మాత సి. కల్యాణ్ కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు. గిల్డ్ అంతా డొల్ల అని ఇండస్ట్రీకి కావాల్సింది, ఇండస్ట్రీ మనుగడ సాగిస్తోంది చిన్న నిర్మాతల వల్లేనంటూ విమర్శలు గుప్పించారు. గిల్డ్ లో కొంత మంది మాత్రమే ఇలా చేస్తున్నారని, అత్యధిక శాతం నిర్మాతలు బంద్ కు సుకుఖంగా లేరని స్పష్టం చేశారు.
ఇది ఇక్కడితో ఆగలేదు. గిల్డ్ లో వున్న నిర్మాతలు కూడా స్వరం మారుస్తున్నారు. గిల్డ్ నిర్ణయం అంటూ ప్రకటించిన ప్రకటనపై మండిపడుతున్నారు. ఇండస్ట్రీలోని కీలక అంశాలపై ముందు వరుసలో నిలబడి స్వరం వినిపించే డి. సురేష్ బాబు, ఏషియన్ థియేటర్స్ అధినేత సునీల్ నారంగ్, అల్లు అరవింద్ లాంటా వాళ్లు మౌనం దాల్చిన వేళ స్టార్ ప్రొడ్యూసర్లు గిల్డ్ తీర్మానంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం , వారి నిర్ణయాన్ని తప్పుబట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
గిల్డ్ సభ్యుల్లోనే తాజా నిర్ణయాలపై సఖ్యత లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ డైరెక్ట్ గానే గిల్డ్ నిర్ణయాలపై తాజాగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ క్షేబం కోసం మెజారిటీ నిర్మాతలంతా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తన సంపూర్ణ మద్దుతు వుంటుందని ప్రకటించిన అశ్వనీదత్ గిల్డ్ నిర్ణయాలపై కాస్త ఘాటుగానే స్పందించారు. ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా కొంత మంది థియేటర్లని తమ చేతుల్లో పెట్టుకుని ప్రతీదీ పెంచేశారని, దాని వల్ల ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే భయపడుతున్నారని స్పష్టం చేశారు.
టికెట్ ధరలు పెంచిన వాళ్లే ఇప్పడు షూటింగ్ లు బంద్ అంటూ ఆందోళనలకు దిగుతున్నారు.అసలు షూటింగ్ లు బంద్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?..ఇప్పుడున్న నిర్మాతల్లో స్థిరత్వం లేదు. ప్రొడ్యూసర్స్ శ్రేయస్సు కోసమే ప్రొడ్యూసర్స కౌన్సిల్ ఏర్పడింది. మధ్యలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదు' అంటూ నిప్పులు చెరిగారు అశ్వనీదత్. ఆశ్వనీదత్ వెర్షన్ ఇలా వుంటే బండ్లన్న వెర్షన్ మరీ నాటుగా వుంది. గత కొన్ని నెలలుగా పవన్ కు దూరంగా వున్న బండ్ల గణేష్ ప్రతీ విషయంలోనూ తన ఫ్రస్ట్రేషన్ ని బయటపెడుతూ వస్తున్నారు.
తాజాగా గిల్డ్ వ్యవహరంపై కూడా బండ్లన్న కాస్త ఘాటుగానే స్పందించడం ఇప్పుడు వ్యవహారం మరింత రచ్చగా మారబోతోందని తెలుస్తోంది. నిర్మాతలంతా యూనిటీగా వున్నారని చెబుతుంటారు మరి షూటింగ్ ల బంద్ విషయంలో ఎందుకు ఎవరికి తోచింది వారు కౌంటర్ లు ఎందుకు వేస్తున్నారు? .. అసలు కథ ఏంటీ? .. ఎక్కడ కొడుతోంది? అని ఆరా తీస్తే దిల్ రాజు అని ఇన్ సైడ్ టాక్. ఆయన వ్యవహరిస్తున్న తీరే ప్రస్తుతం మెజారిటీ వర్గం గిల్డ్ సభ్యుల్లో అసహనాన్ని కలిగిస్తోందని లీకులు బయటికి వస్తున్నాయి.
తాజాగా అశ్వనీదత్ వంటి స్టార్ ప్రొడ్యూసర్ బాహాటంగానే గిల్డ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం గమనిస్తున్న వారంతా టాలీవుడ్ లో షూటింగ్ ల బంద్ ప్రొడ్యూసర్ల మధ్య చిచ్చు రగిలిస్తోందని, అసలు కథ ఇప్పుడే మొదలైందని సెటైర్లు వేస్తున్నారు.