Begin typing your search above and press return to search.
స్టార్ డైరెక్టర్ల వైఫల్యానికి కారణం ఎవరు?
By: Tupaki Desk | 1 Sep 2022 11:30 PM GMTటాలీవుడ్ లో ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ స్టార్ డైరెక్టర్లు భారీ డిజాస్టర్లని సొంతం చేసుకుంటూ షాకిస్తున్నారు. క్రేజీ స్టార్లతో చేసిన సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. దీనికి కారణం ఏంటీ? ఆయా సినిమాల వైఫల్యానికి బాధ్యత దర్శకులదేనా? .. లేక హీరోలది కూడా వుందా?.. వుంటే కేవలం దర్శకులనే ఎందుకు నిందిస్తున్నారు? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన మూవీ `ఆచార్య`. కెరీర్ లో తొలి మూవీ నుంచి అపజయమెరుగని దర్శకుడిగా పేరున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కించారు. రిలీజ్ కు ముందు, నిర్మాణ దశలోనూ ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ అనిపించుకుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఇదే విషయాన్ని పలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లలో వెల్లడిస్తూ చిరంజీవి సంచలనం సృష్టిస్తున్నారు. దర్శకులు సెట్ లో సీన్ లు రాస్తున్నారని, అప్పటికప్పుడు సీన్ లు వండివారుస్తున్నారని ముందు ప్రకటించిన తన అసంతృప్తిని వెల్లడించిన మెగాస్టార్ తాజాగా `ఫస్ట్ డే ఫస్ట్ షో` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రీసెంట్ గా విడుదలైన `బింబిసార`, సీతారామం, కార్తికేయ 2 సినిమాలని గుర్తు చేస్తూ కంటెంట్ బాగుంటేనే సినిమాలే ఆడతాయన్నారు.
మంచి కంటెంట్ ఇస్తే ప్రేక్షకుల తప్పకుండా ఆదరిస్తారని, అంతే కాకుండా కాంబినేషన్ లు, నటీనటుల డేట్స్ క్లాష్ అవుతున్నాయని కంగారు కంగారుగా షూటింగ్స్ చేయద్దని కామెంట్ చేశారు.చిరు వ్యాఖ్యల నేపథ్యంలో స్టార్ డైరెక్టర్లకు స్టార్లతో వర్క్ చేస్తే స్వేచ్ఛ వుంటుదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టార్ హీరోల డిమాండ్ లని కాదని దర్శకుడు ముందుకు వెళతాడన్నది పచ్చి అబద్ధం.. అలా చేస్తే స్టార్ హీరో ప్రాజెక్ట్ నే ఆపేసే ప్రమాదం వుంది. డైరెక్టర్ల పనిలో ఎలాంటి జోక్యం చేసుకోకుండా సినిమా పూర్తి చేసే స్టార్ హీరోలు టాలీవుడ్ లో ఎంత మంది వున్నారు అంటూ నో ఆన్సర్.
దర్శకుడు ఎలాంటి కథతో వచ్చినా స్టార్ హీరో చెప్పిన మార్పులు చేయాల్సిందే. డైలాగ్ లు, సీన్ లతో సహా మార్చాల్సిందే. మరి అలాంటప్పు డిజాస్టర్, ఫ్లాప్ లు ఎదురైనప్పుడు డైరెక్టర్లనే బాధ్యులని చేయడం ఎంత వరక కరెక్ట్ అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తోంది.
రీసెంట్ గా విడుదలైన సినిమాలు తీసుకుంటే అందులో కొన్నింటిలో మాత్రం దర్శకుల వైఫల్యమే కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ `లైగర్`, రామ్ `ది వారియర్`, నితిన్ `మాచర్ల నియోజక వర్గం, `పక్కా కమర్షియల్` వంటి తదితర సినిమాల విషయంలో దర్శకుడు చెప్పింది చేశారనేది ప్రధానంగా వినిపించింది. కానీ స్టార్ హీరోల సినిమాల విషయంలో మాత్రం హీరోలు అభిమానుల కోసం చేయించే మార్పులు, స్టార్ డమ్ సినిమా ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.