Begin typing your search above and press return to search.
ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో బ్లాక్ బస్టర్ సినిమాల హంగామా!
By: Tupaki Desk | 8 Sep 2022 9:30 AM GMTటాలీవుడ్ జూన్, జూలైలలో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ లని చూపింది. రెండు నెలల్లో విడుదలైన ఏ సినిమా కూడా హిట్ అనే మాట కాదు కదా కనీసం యావరేజ్ అనే మాటని కూడా రాబట్టలేకపోయాయి. దీంతో ఇండస్ట్రీ వర్గాల్లో వణుకు మొదలైంది. థియేటర్లలోకి వచ్చిన ప్రతీ సినిమా ఇలా డిజాస్టర్ అనిపించుకుంటూ కోట్లల్లో నష్టాలని తెచ్చిపెడుతుంటే ఇండస్ట్రీ మనుగడ ఏంటీ అనే మదనం మొదలైంది. థియేటర్లకు ప్రేక్షకులు ఇక రారా? సినిమాలని ఆదరించరా? అనే భయాలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆగస్టులో విడుదలైన మూడు సినిమాలు దుల్కర్ సల్మాన్ నటించిన 'సీతారామం', నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార', నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' బ్యాక్ టు బ్యాక్ కేవలం హిట్ అనే కాకుండా బ్లాక్ బస్టర్స్ అనిపించుకుని ఇండస్ట్రీకి కొత్త ఆశల్ని కలిగించాయి. భయాందోళనకు గురవుతున్న టాలీవుడ్ మేకర్స్ కి ధైర్యాన్ని అందించిన ఇండస్ట్రీ వర్గాల్లో ఈ మూడు సినిమాలు సరికొత్త జోష్ ని నింపాయి.
వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించి నిర్మాతలకు లాభాల్ని తెచ్చిపెట్టిన ఈ మూవీ క్రేజీ ప్రాజెక్ట్ లు సెప్టెంబర్ నుంచి ఓటీటీల్లో సందడి చేయబోతున్నాయి. లెఫ్టినెంట్ రామ్ కి, ప్యాలెస్ లో వుండే ప్రిన్సెస్ నూర్జహాన్ కి మధ్య సాగే హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ మూవీ ఎపిక్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుని విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది. పీరియాడిక్ ఫిక్షనల్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఆగస్టు 5న విడుదలై ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న 'సీతారామం' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇక ఇదే రోజు విడుదలైన నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆరు వారాల తరువాతే ఓటీటీలో అనే కండీషన్ తరువాత విడుదలవుతున్న సినిమాలివి. ఇక ఇదే సినిమాల బాటలో నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' కూడా ఓటీటీ బాట పడుతోంది. ఆగస్టు 13న విడుదలైన ఈ మూవీ అనూహ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
దక్షిణాదిలోనే కాకుండా హిందీ వెర్షన్ ఉత్తరాదిలోనూ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ సంచలన విజయం దిశగా పయనిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల మార్కుని అధిగమించిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 సొంతం చేసుకుంది.
ప్రస్తుతం నార్త్ బెల్ట్ లో డ్రీమ్ రన్ ని కొనసాగిస్తూ ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తున్న 'కార్తికేయ 2' కూడా సెప్టెంబర్ లోనే జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇలా మూడు బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ ఒకే నెలలో ఓటీటీల్లోకి వచ్చేస్తుండటం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.