Begin typing your search above and press return to search.
ఇక్కడే కాదు అక్కడ కూడా తుస్సుమన్న దీపావళి సినీ టపాసులు
By: Tupaki Desk | 26 Oct 2022 5:33 AM GMTదసరా సందర్భంగా గాడ్ ఫాదర్.. ది ఘోస్ట్.. స్వాతిముత్యం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ వెంటనే వచ్చిన దీపావళి కానుకగా ప్రిన్స్... జిన్నా.. సర్దార్.. ఓరి దేవుడా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ నాలుగు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ నామమాత్రంగానే ఉన్నాయి.
ఓరి దేవుడా మరియు సర్దార్ సినిమాలకు టాక్ పాజిటివ్ గా వచ్చింది. అయినా కూడా వసూళ్ల విషయం లో నిరాశ తప్పలేదు. ఇక జిన్నా సినిమా కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. ఒక తెలుగు సినిమా వసూళ్లేనా ఇవి అన్నట్లుగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ నాలుగు సినిమా లు ఓవర్సీస్ లో కూడా తుస్సుమన్నాయి.
ఈ దీపావళికి మోత మ్రోగించేందుకు వచ్చిన ఈ నాలుగు సీమ టపాసులు అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా విఫలం అయ్యాయి. దసరాకు వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా తో పాటు మరి కొన్ని సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం మనం చూశాం. కానీ ఈ నాలుగు సినిమాల్లో ఏ ఒక్కటి కూడా మినిమం అక్కడ వసూళ్లు నమోదు చేయలేదు.
తెలుగు సినిమాలకు యూఎస్ బాక్సాఫీస్ వద్ద మినిమం మార్కెట్ ఉంటుంది. కానీ జిన్నా సినిమా దారుణమైన కలెక్షన్స్ ను నమోదు చేయగా పర్వాలేదు అంటూ టాక్ ను పొందిన విశ్వక్ సేన్ ఓరి దేవుడా మరియు కార్తి సర్దార్ సినిమాలు కూడా మినిమం కలెక్షన్స్ ను రాబట్టలేక పోవడం విడ్డూరంగా ఉందటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.
పెద్ద హీరోల సినిమాలు సూపర్ హిట్ దక్కించుకున్న సినిమాలకు మాత్రమే యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ మధ్య కాలంలో ఆధరణ లభిస్తోంది అని మరోసారి నిరూపితం అయ్యింది.
కరోనా కి ముందు పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పు వచ్చింది. చిన్న సినిమాలను ఓటీటీలో చూద్దాం అన్నట్లుగా యూఎస్ తెలుగు ప్రేక్షకులు కూడా థియేటర్ లకు వెళ్లడం మానేశారేమో అనిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.