Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బాక్సాఫీస్.. సంక్రాంతికి బిగ్గెస్ట్ ఫైట్!

By:  Tupaki Desk   |   10 Oct 2022 1:30 PM GMT
టాలీవుడ్ బాక్సాఫీస్.. సంక్రాంతికి బిగ్గెస్ట్ ఫైట్!
X
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొత్తానికి దసరా ఫెస్టివల్ కు మూడు విభిన్నమైన సినిమాలు ప్రేక్షకులను ముందుకు వచ్చాయి. అయితే ఈ ఫెస్టివల్ లో మాత్రం బాక్స్ ఆఫీస్ రేంజ్ కొంచెం కూడా పెరగలేదు. ఇక ఇప్పుడు అందరి ఫోకస్ ఎక్కువగా సంక్రాంతి పండుగపైనే ఉంది. ఆ సమయంలోనే సినిమాలను విడుదల చేసి సక్సెస్ అందుకోవాలని కొంతమంది హీరోలు ఎదురుచూస్తున్నారు.

ఇదివరకే ప్రభాస్ ఆదిపురుష్ తో రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. కానీ ఈ సినిమాకు వస్తున్న డివైడెడ్ కొంత ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు అదే పండగ కు రావడానికి అందరికంటే ముందుగానే వారసుడు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడు. విజయ్ కు ద్విభాషా చిత్రం. తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకోవాలని ఈ హీరో ఎవరు చూస్తున్నాడు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న వారసుడు సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యను కూడా సంక్రాంతికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బాబీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కలయికలో తెరపైకి వస్తున్న కొత్త సినిమా కూడా అదే సమయంలో రావచ్చని తెలుస్తోంది.

ఈ నాలుగు సినిమాలు వేటికవే విభిన్నంగా రాబోతున్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కూడా తీవ్రమైనటువంటి పోటీ నెలకొంటుంది. మరి ఈ పోటీలో అత్యధిక స్థాయిలో ఎవరు పెట్టిన పెట్టుబడి లాభాలను అందుకుంటారో చూడాలి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారం నాలుగు సినిమాల్లో సంక్రాంతి పోటీ నుంచి ఏదో ఒకటి తప్పుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి లేదా బాలయ్య బాబు మధ్య క్లాష్ ఉండకపోవచ్చు అని సమాచారం. ఎక్కువగా అయితే బాలకృష్ణ సినిమా వాయిదా పడవచ్చు అని లేదా అంతకంటే ముందు రావచ్చు అని కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.