Begin typing your search above and press return to search.

'గాడ్ ఫాద‌ర్' పై ఎటాక్ కి రెడీ అయిన 9 సినిమాలు!

By:  Tupaki Desk   |   12 Oct 2022 3:30 PM GMT
గాడ్ ఫాద‌ర్ పై ఎటాక్ కి రెడీ అయిన 9 సినిమాలు!
X
మొత్తానికి ద‌స‌రా రేసులో నిల‌బ‌డిన ఒకే ఒక్క చిత్రంగా 'గాడ్ ఫాద‌ర్' నిలిచింది. భారీ విజ‌యం దూసుకుపోతున్న సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతున్నారు. బ్రేక్ ఈవెన్ సాధ్య‌మైందా? లేదా? అన్న‌ది ఇంకా క్లారిటీ లేదుగానీ..అదేమి గాడ్ పాద‌ర్ కి పెద్ద విష‌యం కాక‌పోవ‌చ్చ‌ని అంచ‌నాలున్నాయి. కొత్త సినిమాలు రిలీజ్ అవ్వ‌డానికి ఇంకా రెండు రోజులు స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో గాడ్ పాద‌ర్ వేగానికొచ్చిన ప్ర‌మాద‌మేం లేదు.

వ‌చ్చే వారం రిలీజ్ అయ్యే సినిమాలు హిట్ అయితే చిరుపై ఆ ఇంపాక్ట్ కాస్త ప‌డే అవ‌కాశం ఉంది. ఓ సారి వ‌చ్చే శుక్ర‌వారం రిలీజ్ కాబోతున్న సినిమాల సంగ‌తి చూస్తే ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలుస్తున్నాయి. ఈవారం ఏకంగా ఒకే రోజు తొమ్మిది సినిమాలు ప్రేక్ష‌కుల‌ముందుకు రాబోతున్నాయి. హిట్ కోసం చెకోర ప‌క్షిలా ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్ న‌టిస్తోన్న 'క్రేజీఫెలో' రిలీజ్ అవుతుంది.

ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాలు సినిమాకి కాస్త బ‌జ్ తీసుకొచ్చాయి. మ‌రి ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే వాయిదాల మీద వాయిదా ప‌డుతూ ఇచ్క‌చిన సినిమా 'బాయ్ ఫ్రెండ్ ఫ‌ర్ హైర్' కూడా ప్రైడేకి ఫిక్స్ అయింది. మ‌రి ఆ వాయిదాల‌న్నింటిన ఉత్సహంగా మ‌లుస్తుందా ? లేదా? అన్న‌ది చూడాలి. మ‌రోపైపు కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా అవ‌త‌రించిన య‌శ్ గ‌త సినిమాని 'రారాజు' టైటిల్ తో డ‌బ్ చేసి వ‌దులున్నారు.

ఇంకా 'గీత‌..నావెంట ప‌డుతున్న చిన్న‌వాడెవ‌ర‌మ్మా'...' నిన్నే పెళ్లాడ‌తా'..'రుద్ర‌నేత్రి'..'నీతో' చిత్రాల‌న్ని 14న రిలీజ్ అవుతున్నాయి. వీట‌న్నింటిలో చెప్పుకోద‌గ్గ సినిమా ఏదైనా ఉందంటే? అది క‌న్న‌డ డ‌బ్బింగ్ చిత్రం 'కాంతార‌'. ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ రిలీజ్ చేయ‌డంతో రీచ్ ఎక్కువ‌గా ఉంది. క‌న్న‌డ‌లో హిట్ అవ్వ‌డం స‌హ ప‌లు కార‌ణాలు సినిమాకి మంచి అంచ‌నాలు తీసుకొచ్చాయి.

అయితే ఈసినిమా ఒక్క రోజు గ్యాప్ తో రిలీజ్ అవుతుంది. ఈసినిమాపై నిర్మాత‌లు కాన్పిడెంట్ గా ఉన్నారు. అనూహ్య విజ‌యం అందుకుంటుంద‌నే ధీమా క‌నిపిస్తోంది. అయితే వీటికి త‌గ్గ‌ట్టు రిలీజ్ ప్ర‌చారం మాత్రం పెద్ద‌గా క‌నిపించ‌లేదు. సొంత సోష‌ల్ మీడియాలో ప్లాట్ ఫామ్స్ లో ప్ర‌చారం త‌ప్ప‌! మెయిన్ స్ర్టీమ్ మీడియాలో ఈ సినిమాలేవి హైలైట్ కావ‌డం లేదు.

ప్ర‌చారం ప‌రంగా సినిమాల‌న్నీ వీక్ గానే క‌నిపిస్తున్నాయి. రిలీజ్ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ ప‌రంగా కాస్త బూస్టింగ్ ఇస్తే ప్రేక్ష‌కుల‌కు బాగా రీచ్ అయ్యే అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఉన్న ఈ రెండు రోజుల స‌మ‌యాన్ని అయినా ప్ర‌చారం కోసం స‌ద్వినియోగం చేసుకుంటారేమో చూడాలి.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.