Begin typing your search above and press return to search.
సినిమా వాళ్లందరికీ ఇకపై ఒకే కమిటీ- జేఏసీ
By: Tupaki Desk | 21 April 2018 12:48 PM GMTతెలుగు సినిమా ఒక పెద్ద కుదుపునకు గురయిన విషయం తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరయిన పరిశ్రమ ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు ఒక సమావేశం కూడా నిర్వహించారు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. కాస్టింగ్ కౌచ్ తో పాటు - టాలీవుడ్ లోని ఇతర సమస్యలపై సినీ ప్రముఖులతో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ నెలకొల్పారు. ఇక అన్ని సమస్యల పరిష్కారానికి ఈ కమిటీ కృషి చేస్తుందట.
ఇక కమిటీ విషయానికొస్తే 21 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఈ జేఏసీకి యార్లగడ్డ సుప్రియ కన్వీనర్ గా నియమితులయ్యారు. సుప్రియ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ ఈడీ గా ఉన్నారు. ఈ కమిటీలో 24 క్రాఫ్ట్స్ అధ్యక్ష - కార్యదర్శులు సభ్యులుగా కొనసాగుతారు. అలాగే దర్శకురాలు నందినీరెడ్డి - స్వప్నాదత్ సభ్యులుగా నియమితులయ్యారు. క్యాస్టింగ్ కౌచ్ మాత్రమే కాకుండా ఇకపై సినిమా పరిశ్రమకు సంబంధించి ఏ ఇష్యూపై అయినా ఈ జేఏసీ పరిష్కారం కనుక్కునే ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సభ్యులందరూ సహకరిస్తారు. పరిశ్రమ సమస్యలపై ఈ కమిటీదే తుది నిర్ణయం.
అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో జరిగిన ఈ సమావేశానికి సినీరంగానికి చెందిన నిర్మాతలు - నటులు - దర్శకులతో పాటు 24 శాఖలకు చెందిన 80 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. కాగా - నిర్మాలు అల్లు అరవింద్ - సి.కల్యాణ్ - శివాజీరాజా - జెమినీ కిరణ్ - ఎన్వీ ప్రసాద్ - హేమ - ఆదిశేషగిరిరావు - సురేందర్ రెడ్డి - ఎన్.శంకర్ - నాగఅశోక్ - హరీశ్ శంకర్ - మెహర్ రమేష్ - కేఎస్ రామారావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
త్వరలో క్యాష్ కమిటీ ఏర్పాటు కూడా చేస్తారని చెబుతున్నారు. అందులో కూడా దాదాపు ఇదే సంఖ్యలో సభ్యులు ఉంటారు. సగం మంది బయట వాళ్లు అంటే ప్రజా సంఘాలు - లాయర్లు వంటి వారిని కూడా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ కమిటీ ఏర్పాటుకు దారితీసిన వివాదానికి కారణమైన శ్రీరెడ్డిపై పలువురు సినిమా ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.