Begin typing your search above and press return to search.
సినిమాలు రిలీజైతే చాలు.. అవార్డుల సంగతి దేవుడెరుగు..!
By: Tupaki Desk | 1 May 2021 1:30 AM GMTసినీ ఇండస్ట్రీకి బెస్ట్ సీజన్స్ లో సమ్మర్ ఒకటి. హాట్ సమ్మర్ లో కూల్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి మేకర్స్ ప్రయత్నిస్తుంటారు. వేసవి వచ్చిందంటే ఓ వైపు క్రేజీ సినిమాలు రిలీజుల హడావుడితో పాటు, మరో వైపున రకారకాల అవార్డు ఫంక్షన్ లతో చిత్ర పరిశ్రమ కళకళలాడిపోతూ ఉంటుంది. అయితే గత రెండేళ్లుగా సైమా, ఫిల్మ్ ఫేర్ తదితర అవార్డు ఫంక్షన్ల ఊసే లేకుండా పోయింది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు ఏవీ జరగలేదు. వర్చువల్ విధానంలో కొందరు అవార్డు ఫంక్షన్స్ ఏర్పాటు చేసినప్పటికీ, సినిమా వారు వాటిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించ లేదు.
లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఇండస్ట్రీలో కొన్ని నెలలు అన్ని పనులు సజావుగానే జరిగాయి. ఈ ఏడాది ఆరంభం బాగానే కుదిరినప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. మొదటి మూడు నెలలు కొత్త సినిమాలతో సందడిగా మారింది. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ తో ఇండస్ట్రీలో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. ఇప్పుడు సినిమాలు విడుదల చేసినా, జనాలు థియేటర్ కి వస్తారో లేదో అని ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ తెగ భయపడుతున్నారు. పరిస్థితులు చక్కబడి సినిమాలు రిలీజై పెట్టిన పెట్టుబడి వస్తే చాలు.. అవార్డుల సంగతి దేవుడెరుగు అనే మాట ప్రస్తుతం టాలీవుడ్ లో అందరినోటా వినిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో అన్నీ పరిస్థితులు అనుకూలించి ఇండస్ట్రీలో కార్యకలాపాలు సజావుగా సాగుతాయేమో చూడాలి.