Begin typing your search above and press return to search.
ఎస్పీ బాలుకు టాలీవుడ్ గ్రాండ్ ట్రిబ్యూట్.. కృష్ణ - చిరు స్పందన..!
By: Tupaki Desk | 4 Jun 2021 11:30 AM GMTతన గాత్రంతో ఆబాలగోపాలాన్ని అలరించిన గానగంధర్వుడు, లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి నేడు(జూన్ 4). ఎస్పీబీ 75వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనకు ఘన నివాళి అర్పిస్తోంది. స్వరబ్రహ్మ డైమండ్ జూబ్లీ వేడుకలను ఈరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా నిర్వహించేందుకు టాలీవుడ్ సన్నద్ధమయింది. 12 గంటలపాటు ఆన్ లైన్ వేదికగా జరుగుతున్న ఈ లైవ్ కార్యక్రమం ద్వారా సినీలోకం బాలు నామాన్ని స్మరిస్తోంది. ఈ ప్రోగ్రామ్ లో హీరోహీరోయిన్లు, దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, గేయ రచయితలు, మా అసోషియేషన్, అందరూ పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ బాలసుబ్రహ్మణ్యం తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. భారతీయ సినిమాకు ఎస్పీబీ చేసిన సేవల్ని స్మరించుకుంటున్నారు. రాఘవేంద్రరావు - కోదండరామి రెడ్డి - రాఘవేంద్రరావు - విశ్వనాధ్ లతో పాటుగా ఎన్. శంకర్ - కొరటాల శివ - త్రివిక్రమ్ శ్రీనివాస్ - గోపీచంద్ మలినేని వంటి దర్శకులు ఆయన గురించి మాట్లాడారు. సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ ''బాల సుబ్రహ్మణ్యం గారికి నాకు 50 సంవత్సరాల అనుబంధం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మొదటి సారి 'నేనంటే నేనే' సినిమాలో అన్ని పాటలు పాడారు. 16 భాషల్లో నాలుగు వేల పాటలు పాడి వరల్డ్ రికార్డ్ సృష్టించిన కళాకారుడాయన. అలాంటి వ్యక్తి మన తెలుగువాడు అవటం మన అందరి అదృష్టం'' అని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ''ఈరోజు నేను మిశ్రమ అనుభూతికి లోనవుతున్నాను. ఒకవైపు ఇలాంటి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు ఆనందగా ఉంది. మరోవైపు బాలును తలచుకుని మనసు బరువెక్కిపోయి ఉంది. బాలు అన్నయ్య 75వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను. బాలు గారికి నాకు 80వ దశకం నుంచి అనుబంధం ఉంది. 'బాలు గారు' అని ఓ సందర్భంలో నేను పిలిచినప్పుడు అన్నయ్యా అనేవాడివి ఇలా పిలిచి ఎందుకయ్యా దూరం చేస్తావ్ అన్నారు. కానీ ఇప్పుడు ఎవరికి అందనంత దూరం వెళ్లిపోయారు. సినిమాల విషయానికొస్తే నా సినిమాల విజయానికి సగ భాగం బాలు గారికి చెందుతుంది'' అన్నారు. అంతేకాదు ''అనితర సాధ్యుడు, మహా గాయకుడు, ప్రియ సోదరుడైన బాలు గారికి అశ్రు నీరాజనం.. మనందరినీ శోక సముద్రంలో ముంచి ఇంత త్వరగా వీడి వెళ్లిన ఆ గాన గంధర్వుడి 75 వ జన్మ దిన సంధర్బంగా ఈ స్మృత్యంజలి.. వినమ్ర నివాళి!'' అని ట్వీట్ చేసిన చిరంజీవి.. ఓ వీడియోని షేర్ చేశారు.
కాగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయకునిగానే కాకుండా నటునిగా, సంగీత దర్శకునిగా, గాత్రదాతగా కూడా మెప్పించారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులూ రివార్డులూ సాధించారు బాలు. 23 నంది అవార్డులు అందుకొని చరిత్ర సృష్టించిన ఎస్పీబీ.. ఉత్తమ గాయకునిగా ఆరుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు.