Begin typing your search above and press return to search.
హరీష్ కు అక్కడన్నా పని అవుద్దా..?
By: Tupaki Desk | 15 Nov 2022 2:30 PM GMTఇంట గెలిచి రచ్చ గెలువు అనే సామెతను చాలామంది దర్శకులు ఫాలో అవుతున్నారు. తెలుగు సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్ సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. ముంబైలోనే మకాం వేస్తూ తమ స్టోరీలతో అక్కడి స్టార్ హీరోలను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
నిజానికి అప్పటి ఆదుర్తి సుబ్బారావు - కె. బాపయ్య - బాపు - దాసరి నారాయణరావు - కె. రాఘవేంద్రరావు - కె. విశ్వనాథ్ - ఈవీవీ సత్యనారాయణ - రవిరాజా పినిశెట్టి నుంచి ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ - తేజ - విజయ్ భాస్కర్ - కృష్ణవంశీ - క్రిష్ - పూరీ జగన్నాథ్ - దేవ కట్టా వరకూ అనేక మంది హిందీలో సినిమాలు చేశారు.
ఇటీవల కాలంలో సందీప్ రెడ్డి వంగా - గౌతమ్ తిన్ననూరి - శైలేష్ కొలను - సంకల్ప్ రెడ్డి వంటి పలువురు యంగ్ డైరెక్టర్స్ కూడా బాలీవుడ్ మీద దృష్టి సారించారు. ఈ క్రమంలో టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా హిందీలో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది.
పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన హరీష్ శంకర్.. ఈసారి ఒరిజినల్ స్క్రిప్ట్ తో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేయాలని భావించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే నెలలు గడుస్తున్నా ఇంత వరకూ ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళలేదు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల దృష్టి పెట్టిన నేపథ్యంలో 'హరి హర వీరమల్లు' సినిమా మాత్రమే పూర్తి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కమిటైన ప్రాజెక్ట్స్ అన్నీ సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఉండొచ్చని టాక్ ఉంది. ఈ విషయంలో పవన్ దర్శకులకు క్లారిటీ ఇచ్చారని.. ఇతర సినిమాలు చేసుకొని రావాల్సిందిగా సూచించారని వ్ వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ తో బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయడానికి మైత్రీ టీమ్ ప్రయత్నాలు చేస్తోందని రూమర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను అడ్వాన్స్ ఇచ్చున్నారు కాబట్టి.. హరీష్ తో అగ్ర హీరోకి స్టోరీ చెప్పించే పనిలో ఉన్నారని కూడా టాక్ వచ్చింది.
ఓ కమర్షియల్ యాడ్ కోసం ముంబై వెళ్లిన హరీష్.. పనిలో పనిగా సల్మాన్ ను మీట్ అయినట్లుగా చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రస్తుతం నటిస్తున్న 'టైగర్ 3' 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమాల షూటింగ్స్ చివరి దశలు వచ్చాయి. వీటి తర్వాతి ప్రాజెక్ట్ కు అతను ఇంకా సైన్ చేయలేదు.
ఒకవేళ హరీష్ శంకర్ కథ సల్మాన్ ఖాన్ కు నచ్చితే వీలైనంత త్వరగా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. మరి బాలీవుడ్ లో అయినా టాలెంటెడ్ డైరెక్టర్ కు పని అవుద్దేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.