Begin typing your search above and press return to search.
టాలీవుడ్ కి 'కరోనా క్రైసిస్ ఛారిటీ' ఉంది.., మరి కోలీవుడ్ కి..?
By: Tupaki Desk | 3 April 2020 3:30 PM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీని వలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విపత్తు వచ్చినా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుంది. హీరోలు, దర్శక నిర్మాతలు తమ వంతుగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సారథ్యం లో సీసీసీ చారిటీని ప్రారంభించి సినీ కార్మికులకు సహాయార్థం నిధిని సేకరిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఇప్పటికే సుమారు 7 - 8 కోట్లు జమ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. చిరంజీవి - అక్కినేని నాగార్జున - వెంకటేష్ - మహేష్ బాబు - ప్రభాస్ - ఎన్టీఆర్ - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - నాగచైతన్య - నితిన్ - మంచు మనోజ్ - అల్లరి నరేష్ - నాని వంటి వారు ముందుకు వచ్చి తమ వంతుగా విరాళాలు అందించి వారి బాధ్యతను నెరవేర్చారు. కానీ మన పక్కనే ఉన్న తమిళనాడు సినీ పరిశ్రమలో మాత్రం ఎలాంటి కదలిక కనిపించడం లేదు.
రజినీకాంత్ - సూర్య - శివకార్తికేయన్ లాంటి కొందరు విరాళాలు ప్రకటించినా టాలీవుడ్ లాగా కోలీవుడ్ లో స్పందన లేదనే చెప్పవచ్చు. మన టాలీవుడ్ లో లాగా ఒక ఛారిటీని ఏర్పాటు చేసి సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చే హీరోనే కరువయ్యాడు. మాములు రోజుల్లో అన్నిట్లో నేనే అంటూ హడావిడి చేసే విశాల్ - కార్తీ - శింబు లాంటి హీరోలు సైతం ఇలాంటి వాటికి పూనుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తమిళ స్టార్స్ అసలు కరోనాపై యుద్ధానికి ఎందుకు ముందుకు రావడం లేదని కోలీవుడ్ అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఎంతోమంది పాన్ ఇండియా స్టార్స్, -డైరెక్టర్స్ ఉన్న కోలీవుడ్.. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు అంత సైలెంటుగా ఉంటోంది. తమిళనాడులో కరోనా లేదా ఏంటి..? సినీ వర్కర్లు పనులు కోల్పోయి రోడ్డున పడుతున్నారు.. కనీస సౌకర్యాలు లేక తిండికి అలమటిస్తున్నారు.. వారిని ఆదుకోడానికి తమిళ హీరోలు ఎందుకు ముందుకు రావడం లేదు.. వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు గుర్తుకు రావడం లేదా.. అని తమిళనాడులోని ప్రతీ ఒక్కరు ఆలోచిస్తున్నారు. పక్కనే ఉన్న టాలీవుడ్ ని చూసి కోలీవుడ్ స్టార్ హీరోలు నేర్చుకోవాలని తమిళ ప్రజలు సోషల్ మీడియా వేదికగా సూచిస్తున్నారు.