Begin typing your search above and press return to search.

వేలకోట్ల రూపాయల అనుభవాన్ని టాలీవుడ్ ఇచ్చింది: పీవీపీ

By:  Tupaki Desk   |   27 Aug 2019 5:26 AM GMT
వేలకోట్ల రూపాయల అనుభవాన్ని టాలీవుడ్ ఇచ్చింది: పీవీపీ
X
ప్రసాద్ వీ పొట్లూరి పేరు తెలియనివారు దాదాపుగా ఉండరు. పీవీపీగా చిరపరిచితులైన ఆయన ఒక వ్యాపారవేత్తగా ఎన్నో విజయాలు సాధించారు. రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా కొనసాగుతూ ఉన్నారు. గత ఎనిమిదేళ్లుగా సినీరంగంలో నిర్మాతగా కొనసాగుతున్నారు. రీసెంట్ గా 'ఎవరు' తో విజయాన్ని అందుకున్నారు. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో పీవీపీ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. అందులోనుంచి కొన్ని ప్రశ్నలు సమాధానాలు.

*మీరు ఒక కార్పోరేట్ ప్రపంచం నుంచి వచ్చారు. కార్పోరేట్ కంపెనీస్ అన్నీ ఒక ఆర్గనైజ్డ్ గా ఉంటాయి.. కానీ సినిమా పరిశ్రమ ఎక్కువ శాతం అనార్గనైజ్డ్ గా ఉంటుంది. మరి మీకు ఇక్కడ ఆ విషయంలో ఇబ్బంది ఎదురైందా?

తెలుగు తమిళ సినీ పరిశ్రమకు ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో 40% వాటా ఉంది. ఇక్కడ వ్యవస్థ అనార్గనైజ్డ్ గా ఉంటుందని తెలుసు. అయితే మేము కెనాడా లోని లయన్స్ గేట్ లా ఒక పెద్ద నిర్మాణ సంస్థను నెలకొల్పుదామని అనుకున్నాం. బయట దేశాలలో అగ్రిమెంట్స్ కు విలువ ఉంటుంది. బాలీవుడ్ లో కూడా ఈ కల్చర్ వచ్చేసింది . కానీ మన దగ్గర మాత్రం అగ్రిమెంట్స్ కు విలువ ఉండదని తెలుసుకున్నాము. ఇది మాకు షాక్ ఇచ్చిన అంశం."

*మీకు ఈ అగ్రిమెంట్స్ విషయంలో తగిలిన మొదటి షాక్ చెప్పగలరా?

ఊపిరి సినిమాకు షూట్ కు అంతా రెడీ చేసుకున్నాం. మరో వారంలో షూట్ ఉందనగా హీరోయిన్ సినిమాను వదిలేసి వెళ్ళిపోయింది. కాంట్రాక్ట్ సైన్ చేసింది.. ఎడ్వాన్స్ తీసుకుంది. అయినా సినిమాను వదిలేసింది. ఎడ్వాన్స్ కూడా వెనక్కు ఇవ్వలేదు.. ఇదే అమెరికాలో అయితే ఏం జరుగుతుందో తెలుసా? కోర్టుకు తీసుకెళ్ళి ఎమౌంట్ తో పాటుగా డ్యామేజేస్ అంతా కట్టిస్తారు. అయితే ఇక్కడ లీగల్ వ్యవస్థలో డిలేస్ ఉండడం వల్ల కొందరు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి త్వరలో మారుతుంది. బాలీవుడ్ ఇంతకంటే అనార్గనైజ్డ్ గా ఉండేది కానీ లాస్ట్ టెన్ ఇయర్స్ లో అక్కడ అంతా మారిపోయింది. కార్పోరేట్ కల్చర్ వచ్చేసింది. స్క్రిప్ట్ లేకుండా షూట్ కు వెళ్ళడం లేదు.

*మన టాలీవుడ్ లోసమస్య ఎక్కడ ఉంది?

దాదాపు స్టార్స్ అందరితో పనిచేయడం సులువు. అయితే సమస్య అంతా డైరెక్టర్లతోనే ఉంది.. డైరెక్టర్లు ఆర్గనైజ్ద్ గా లేకపోవడం.. ప్లాన్డ్ గా లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ప్రీ ప్రొడక్షన్ వన్ ఇయర్ చేసి బౌండ్ స్క్రిప్ట్ తో.. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తే ప్రొడక్షన్ టైమ్ తగ్గుతుంది.. వేస్టేజ్ తగ్గుతుంది. రిలీజ్ కు రెండు రోజుల ముందు వరకూ నిర్మాతకు ఫైనల్ కట్ చూపించకపోతే ఎలా?

*బ్రహ్మోత్సవం గురించి చెప్పండి

స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కు వెళ్ళాల్సి వచ్చింది. వారం రోజుల ముందు నేను డైరెక్టర్ కు మెయిల్ పెట్టాను. మనం బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్లకు జవాబుదారిగా ఉండాలని చెప్పాను. దానికి సమాధానం లేదు. ఇప్పటికీ ఆ మెయిల్ నాదగ్గర ఉంది.

* ఇండస్ట్రీలో ఉండే చెడ్డ పద్ధతులపై మీరు పోరాటం చేయాల్సివస్తే ఏ విషయాలు మారాలని అంటారు?

వేస్టేజ్.. ప్లానింగ్ లేకపోవడం. నిజానికి ప్లానింగ్ లేకపోవడం వల్లే వేస్టేజ్ జరుగుతుంది. అవి మారాలి.

*ఈ 8 ఏళ్ళ టాలీవుడ్ ప్రయాణంలో ఇండస్ట్రీలో ఏం నేర్చుకున్నారు?

వేయి మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. మేమింకా మొదటి మైల్ లోనే ఉన్నాం. నాకు వ్యక్తిగతంగా ఇది గొప్ప ప్రయాణం. నాకు వేలకోట్ల విలువైన అనుభవాన్ని ఇచ్చింది.. ఈ అనుభవం నాకు ఇతర వ్యాపారాల్లో చాలా ఉపయోగ పడింది. ఆ విధంగా నేను లక్కియస్ట్ అనుకుంటాను. ఈ అనుభవాలు నాకు ఎక్స్ ట్రా అర్దినరిగా ఉపయోగ పడ్డాయి(నవ్వుతూ). ఆ రకంగా నేను ఇండస్ట్రీకి ఎంతో ఋణ పడి ఉంటాను. నేను ప్రపంచం అంతా తిరిగి వ్యాపారం గురించి నేర్చుకున్నది అంతా వదిలిపెట్టి ఇక్కడ కొత్తగా చాలా నేర్చుకోవాల్సి వచ్చింది.