Begin typing your search above and press return to search.
టాలీవుడ్ హీరో 100 కోట్ల ఫ్రాడ్.. అరెస్ట్!
By: Tupaki Desk | 16 Dec 2019 4:19 AM GMTటాలీవుడ్ లో అవకాశాల కోసం వచ్చే వారిని మోసం చేస్తున్న వాళ్లు రోజు రోజుకి ఎక్కువవుతున్నారు. ఆ మధ్య చాన్సిప్పిస్తానంటూ కొందరు అమ్మాయిల్ని మోసం చేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కటకటాల పాలైతే తాజాగా మరో మోసగాడు పోలీసుల చేతికి చిక్కాడు. రకరకాల ఘరానా మోసాలకు పాల్పడుతూ ఓ హీరో కం నిర్మాత ఏకంగా 100 కోట్ల మేర కుచ్చు టోపీ పెట్టాడన్నది ప్రధాన అభియోగం.
అతడు ఎవరు.. ఏమా కథ అన్న వివరాల్లోకి వెళితే... నిర్మాతగా, హీరోగా, డైరెక్టర్‌గా తనని తాను ప్రమోట్ చేసుకుంటూ బీగ్రేడ్ సినిమాలు చేస్తూ పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారిన ఆయన పేరు ఎస్.కె.బషీద్. అల్లరి నరేష్.. సందీప్ కిషన్ లాంటి హీరోలతో సినిమాలు తీశాడు. గతంలో సందీప్ కిషన్ నటించిన ఓ చిత్రాన్ని ఓ తమిళ దర్శకుడు రూపొందిస్తే ఆ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి దర్శకుడిని తానే అంటూ పేరు వేసుకుని వార్తల్లో నిలిచారు.
ఆ సమయంలో సందీప్ కిషన్ తో వివాదానికి దిగి వార్తల్లో కెక్కిన బషీద్ తాజాగా మరో వివాదంలో అడ్డంగా బుక్కవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్య `ఎవడ్రా హీరో` సినిమాతో హీరోగా కూడా అవతారమొత్తిన బషీద్ గత కొంత కాలంగా కొంత మందికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి వారి నుంచి డబ్బును కాజేశాడట. దీంతో అతని కారణంగా మోసపోయిన వారంతా పోలీసులని ఆశ్రయించడంతో బషీద్ ని అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరి నుంచి 30 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేసిన బషీద్ దుబాయ్ లో ఎస్ బీకే గ్రూప్ పేరుతో నకిలీ దందా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడి దందా సుమారు 100 కోట్ల మేర సాగిందనేది పోలీసుల విచారణలో విశ్లేషించారట. దుబాయ్ ఎంబసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బషీద్ ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గత ఆదివారం అరెస్ట్ చేశారు. డ్రగ్స్ .. మాఫియా లాంటి ప్రమాదాలు టాలీవుడ్ కి ఎప్పుడూ పొంచి ఉన్నాయనడానికి ఇప్పటికే ఎన్నో ఆధారాలు బయటపడ్డాయి. ఈ విషయంలో సినీపెద్దలు ఏమేరకు జాగ్రత్త వహిస్తున్నారు? అన్నది చూడాలి.